ప్రధాని మోదీ విమానానికి సాంకేతిక లోపం?
Jharkhand Assembly elecrtions 2024: జార్ఖండ్‌లో మలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 20వ తేదీన చివరి విడత పోలింగ్ జరగాల్సి ఉందక్కడ. ఇంకో రెండు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.

ఈ నెల 13వ తేదీన తొలి విడత పోలింగ్ ముగిసింది జార్ఖండ్‌లో. 20 తేదీన చివరిదైన రెండో విడతలో పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.
మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా 11.84 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. వీరిలో యువ ఓటర్ల సంఖ్య 66.84 లక్షలు.
కాగా ఈ పరిస్థితుల మధ్య జార్ఖండ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవ్‌గఢ్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అక్కడి బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. గిరిజన నేత బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాల్లో పాల్గొన్నారు. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌కు హాజరయ్యారు.
అంతకుముందు బిహార్‌లోని జముయ్ జిల్లా పర్యటించారు మోదీ. 6,640 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా పలువురు మంత్రులు ఇందులో పాల్గొన్నారు.
దేవ్‌గఢ్ నుంచి మళ్లీ ఢిల్లీకి ప్రధాని మోదీ బయలుదేరాల్సి ఉండగా.. ఆయన ప్రయాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనితో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సిన మోదీ రాకలో ఆలస్యం ఏర్పడింది. ఎలాంటి లోపం తలెత్తిందన్నది అధికారులు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications