రాష్ట్రానికి రూ. 83,300 కోట్ల వరాలిచ్చిన మోదీ

PM Modi: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది జార్ఖండ్. మహారాష్ట్రతో కలిసి ఒకేసారి పోలింగ్ జరగాల్సి ఉంది ఇక్కడ. ప్రస్తుతం హర్యానాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే జార్ఖండ్, మహారాష్ట్రల అసెంబ్లీ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.

జమ్మూ కాశ్మీర్‌లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 5వ తేదీన హర్యానాలో ఓటింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత జార్ఖండ్, మహారాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది.

Jharkhand Assembly Elections 2024 PM Modi inaugurates Rs 83 300 cr projects

మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 41. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు, ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.

ఈ పరిణామాల మధ్య జార్ఖండ్‌లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 83,300 కోట్ల రూపాయల మేర విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా హజారీబాగ్‌ గాంధీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ.

సరిగ్గా 17 రోజుల వ్యవధిలో మోదీ జార్ఖండ్‌లో పర్యటించడం ఇది రెండోసారి. కిందటి నెల 15వ తేదీన ఆయన జంషెడ్‌పూర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80,000 కోట్ల రూపాయల విలువ చేసే పక్కా గృహాల నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు.

2,800 కోట్ల రూపాయలతో నిర్మించిన 40 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించారు. ధర్తీ ఆబా జన్‌జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని మోదీ లాంచ్ చేశారు. దీని అంచనా వ్యయం 79,150 కోట్ల రూపాయలు. అంతకుముందు స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఓ పాఠశాలను సందర్శించారు. అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+