వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఝరియా అసెంబ్లీ ఫలితం: సినిమాను తలపించేలా 2014-2019 ఎన్నికలు, ప్రజలే గెలి(పిం)చారు!

|
Google Oneindia TeluguNews

రాంచీ: ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయడం సహజమే. ఒకే నియోజకవర్గం నుంచి కూడా ఒకే కుటుంబంలోని వ్యక్తులు పోటీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగి, సోమవారం ఫలితాలు వెలుడిన జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

సోదరుడినే చంపేశారు..

సోదరుడినే చంపేశారు..

జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాలోని ఝరియా అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒకే కుటుంబం నుంచి పోటీ పడ్డారు. 2014లో ఎమ్మెల్యే సంజీవ్ సింగ్, అతని కజిన్, దివంగత నీరజ్ సింగ్ పోటీ పడ్డారు. బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన సంజీవ్ 30వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన నీరజ్ సింగ్ ఓటమిపాలయ్యారు. కాగా, సంజీవ్ ఆదేశాల మేరకు నీరజ్‌ను కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి.

హత్య కేసులో జైలుకు వెళ్లడంతో.. రంగంలోకి సతీమణులు

హత్య కేసులో జైలుకు వెళ్లడంతో.. రంగంలోకి సతీమణులు

నీరజ్ హత్య కేసులో ఝరియా ఎమ్మెల్యే సంజీవ్‌కు జైలు శిక్ష పడింది. దీంతో ఆ ఇద్దరు నేతల సతీమణులు ఎన్నికల యుద్ధంలోకి అడుగుపెట్టారు. సంజీవ్ భార్య రాగిణి బీజేపీ టికెట్‌పై పోటీలో దిగారు. నీరజ్ సతీమణి పూర్ణిమ కాంగ్రెస్ టికెట్‌పై బరిలో దిగారు.
నీజర్ సింగ్ చిన్న సోదరుడు హర్ష్ సింగ్ అభ్యర్థి పూర్ణిమకు మద్దతుగా మాట్లాడుతూ.. ఝరియా అనేది వాళ్ల పూర్వీకులు ఇచ్చిన ఆస్తిగా భావిస్తున్నారు. వారికి ఎదురుతిరిగితే బతకనివ్వడం లేదు అని సంజీవ్ సింగ్ కుటుంబం గురించి వ్యాఖ్యానించారు.
‘నీరజ్‌ను ఎలా హత్య చేశారో ధన్‌బాద్ చూసింది. ఎంతో రద్దీగా ఉండే స్టీల్ గేట్ వద్దే ఆయనను చంపేశారు. ఎమ్మెల్యేకి రాజకీయ శత్రువుగా మారడంతోనే ఈ పనిచేశారు. మేము మాత్రం నీరు, రోడ్డు, లాంటి ప్రజల వసతుల కోసం పోరాడుతున్నాం' అని పూర్ణిమ వ్యాఖ్యానించారు. ఎన్నికల రోజు ప్రజలు బయటికి వచ్చి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు.

మాఫీయా నుంచి రాజకీయ నాయకుడిగా సూర్య డియో సింగ్..

మాఫీయా నుంచి రాజకీయ నాయకుడిగా సూర్య డియో సింగ్..

మాఫీయా నడిపించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సూర్య డియో సింగ్ ఝరియా ప్రాంతాన్ని అతడు చినపోయేవరకు పాలించాడు. 1977 నుంచి 1991 వరకు కూడా ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగారు. సింగ్ కుటుంబానికి ఈయనే పెద్ద దిక్కుగా ఉండేది. సూర్య డియో సింగ్ ఉన్నంత కాలం తన కుటుంబాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకున్నారు. అప్పుడు ఆయన కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు. సూర్యకు నలుగురు సోదరులు రాజ్ నారాయణ్, బచ్చా, విక్రమ, రామధాన్. సూర్య డియో సింగ్ మరణాంతరం అతని కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. సంపద, ట్రేడ్ యూనియన్, రాజకీయం లాంటి రంగాలపై పట్టుకోసం కుటుంబంలోని వ్యక్తులు పావులు కదిపారు.

సోదరుడికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ఓర్వలేక హత్య..

సోదరుడికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ఓర్వలేక హత్య..

2014లో రాజ్ నారాయణ్ సింగ్ కుమారుడు నీరజ్.. సూర్య సింగ్ కుమారుడైన సంజీవ్ సింగ్ మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకున్నాయి. 2014లో వీరిద్దరూ ఎన్నికల్లో పోటీ చేశారు. అనాటి ఎన్నికల్లో నీరజ్ ఓటమిపాలయ్యారు. అయితే, డిప్యూటీ మేయర్‌గా ఆయన అందించిన సేవలకు గానూ ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. ప్రజల్లో నీరజ్ సింగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూడలేని సంజీవ్ సింగ్ 2017 మార్చిలో కాల్చి చంపించారనే ఆరోపణలున్నాయి. మళ్లీ ఇప్పుడు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బరిలో దిగిన ఇద్దరు నేతల సతీమణుల కారణంగా మరోసారి అల్లర్లు తలెత్తుతాయని అంతా ఆందోళన చెందారు. డిసెంబర్ 16న పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నీరజ్‌ను చంపిన సంజీవ్ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసి పూర్ణిమను గెలిపించడం గమనార్హం.

English summary
This year Jharia, a neighbourhood in Dhanbad Dhanbad Sadar subdivision of Dhanbad district in Jharkhand, is heading for a fierce electoral battle. In 2014, the present MLA, Sanjeev Singh, and his cousin, late Niraj Singh, fought the electoral battle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X