హలో... టూర్ అంతా బాగానే జరిగింది.. వచ్చాం!!
జార్కండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వస్తోంది. రాయ్‌పూర్‌కు మకాం మార్చిన యూపీయే ఎమ్మెల్యేలు 30 మంది రాంచీకి తిరుగుపయనమయ్యారు. స్వామి వివేకానంద అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వీరంతా అక్కడి నుంచి రాంచీ చేరుకుంటారు. విమానాశ్రయంలో వీరికోసం రెండు బస్సులను ఏర్పాటు చేశారు. వీటిల్లోసర్క్యూట్ హౌస్‌కు చేరుకొని నేరుగా అసెంబ్లీకి హాజరవుతారు.

జార్కండ్‌కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలుచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు రావడంతో వీరిని రాయ్‌పూర్ కు తరలించారు. సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలపై సందిగ్ధత ఇంకా వీడలేదు. ఈనెల ఐదోతేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. విశ్వాస తీర్మానానికి సీఎం సోరెన్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా ఎమ్మెల్యేలకు పంపిన లేఖలో అసెంబ్లీ సచివాలయం వెల్లడించింది. తన పేరుమీద మైనింగ్ లీజు తీసుకున్నారంటూ సీఎంపై ఆరోపణలు రావడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత వస్తే హేమంత్ సోరెన్ సతీమణి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని యూపీఏ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications