సీఏఏ, ఎన్ఆర్సీ కారణం, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై అరవింద్ కేజ్రీవాల్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికికి పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌర రిజిష్టర్ కారణమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను తీర్పుగా ప్రజలు ఇచ్చారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
జార్ఖండ్ ఎన్నికల్లో ప్రజలతీర్పుతో వారు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉన్నారని అర్థమవుతుందని కేజ్రీవాల్ అన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్‌ను కేజ్రీవాల్ అభినందించారు. రాష్ట్రంలో బీజేపీ ఓటమికి కారణం ఆ పార్టీ ప్రభావం చూపకపోవడమేనని అన్నారు. మరోవైపు ఓటమిని బీజేపీ చీఫ్ అమిత్ షా అంగీకరించారు. కాంగ్రెస్ కూటమికి అభినందనలు తెలిపారు. ఇటు ప్రధాని మోడీ కూడా హేమంత్ సోరెన్‌ను విష్ చేశారు.

అంతకుముందు జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోవడంతో రాజ్‌భవన్ వచ్చి గవర్నర్ ద్రౌపది ముర్ముకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజీనామా ఆమోదించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్దర్మ సీఎంగా కొనసాగాలని కోరారని చెప్పారు.












Click it and Unblock the Notifications