జియో బంపర్ ఆఫర్: వైఫై రూటర్ల ద్వారా 100% క్యాష్ బ్యాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో టెలికం రంగంలో మరోసారి సంచలనాలకు తెరతీస్తోంది. జియో వైఫై రూటర్ల ద్వారా వందశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తోంది. పరిమితకాలానికి ఉద్దేశించిన ఈ ప్రమోషన్ స్కీమ్ లో భాగంగా రెండు పథకాలను లాంచ్ చేసింది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారానే సంచలనంగా మారింది. ఇతర టెలికం కంపెనీలకు చెక్ పెట్టే పద్దతిలో ఉచిత ఆఫర్లతో జియో కొనసాగించింది.ఆరుమాసాలపాటు ఉచిత ఆఫర్లను కొనసాగించిన జియో ఈ ఏడాది ఏప్రిల్ నుండి తన కస్టమర్ల నుండి ఛార్జీని వసూలు చేస్తోంది.

అయితే జియో మార్కెట్లోకి రావడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లను కూడ మార్పులు చేర్పులు చేసుకొన్నాయి.అయితే జియో దెబ్బకు ఇతర టెలికం కంపెనీల ఆదాయాలు కూడ తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు రిలయన్స్ ఇతర రంగాల్లోకి కూడ అడుగుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. డిటిహెచ్ రంగంలోకి కూడ రిలయన్స్ అడుగుపెట్టనుంది.ఈ మేరకు డిటిహెచ్ ప్రమోషన్లలో కూడ ఉచిత ఆఫర్లతో రానుంది జియో.

క్యాష్ బ్యాక్ ఆఫర్ తో జియో

క్యాష్ బ్యాక్ ఆఫర్ తో జియో

టెలికం రంగంలో సంచలన ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో తాగాజాగా మరో ఆఫర్ ను ప్రకటించింది.రిలయన్స్ జియో వైఫై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తోంది. వైఫై రూటర్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించేవారికి ఈ వందశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.పరిమితకాలానికి ఉద్దేశించిన ఈ ప్రమోషన్ స్కీమ్ లో భాగంగా ఈ రెండు పథకాలను లాంచ్ చేసింది. ఈ మేరకు జియో తన అధికారిక వెబ్ సైట్ లో ఈ విషయాన్ని ప్రకటించింది.

జియో వైఫైలపై రెండు ఆఫర్లు

జియో వైఫైలపై రెండు ఆఫర్లు

రిలయన్స్ జియో వైఫైలపై రెండు ఉచిత ఆఫర్లను ప్రకటించింది ఆ సంస్థ.రిలయన్స్ జియో వెబ్ సైట్ ద్వారా పోర్టబుల్ 4 జీ వైఫై రౌటర్ లేదా హాట్ స్పాట్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రెండు ఆఫర్లను ప్రవేశపెట్టింది.ఎక్స్చేంజ్ లేకుండా రూ.1,005 విలువైన 4 జీ డేటాను ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. ఉచిత ఆఫర్లతో జియో ఇప్పటికే అనేకమంది కస్టమర్లను తన వైపుకు తిప్పుకొంది. ఈ కొత్త ఆఫర్ లో కూడ ఉచిత ఆఫర్ ను తెచ్చింది.

జియో వైఫై రూ.1999లకే

జియో వైఫై రూ.1999లకే

రిలయన్స్ జియో వైఫై రౌటర్ విలువ రూ.1999 గా నిర్ణయం తీసుకొంది. అయితే ఈ రౌటర్ కొనుగోలు చేసేందుకుగాను జియో ఈఎంఐ సదుపాయాన్ని కూడ కల్పించింది. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రౌటర్ కొనుగోలు చేసినవారికి రూ.1,005 విలువైన 5 వోచర్లను ఉచితంగా అందించనుంది. ఎక్స్చేంచ్ లేకుండా రూ.201 విలువైన 5 టాప్ అప్ కూపన్ల ద్వారా 4 జీ డేటాను ఉచితంగా పొందే అవకాశం దక్కనుంది.

నాన్ జియో రౌటర్లను కూడ ఎక్స్చేంచ్ కు అవకాశం

నాన్ జియో రౌటర్లను కూడ ఎక్స్చేంచ్ కు అవకాశం

నాన్ జియో రౌటర్లను కూడ ఎక్స్చేంజ్ చేసుకొనే వెసులుబాటును కల్పించింది రిలయన్స్.ఈ ఎక్స్చేంజ్ తో రూ.201 విలువైన 10 టాపప్ వోచర్లు ఉచితంగా ఇవ్వనుంది జియో.ప్రతి నెలా రీ చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వరుస 5 రీచార్జ్ లకు గాను కస్టమర్లకు అదనంగా 5 జీబీ 4 జీబీ డేటా ఉచితంగా అందిస్తోంది. 2018 మార్చి 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jio is offering up to 100 per cent cash back on purchase of "JioFi Device" in a limited-period promotional scheme. Under Jio's "100% cashback offer with JioFi," customers purchasing the Portable 4G WiFi Router and Hotspot device from the telecom company's website.
Please Wait while comments are loading...