శుభవార్త: వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ ప్రారంభించనున్న జియో

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో కొత్త సంచలనానికి నాంది పలకనుంది. 2018 లో సొంత వర్చువల్ రియాలిటీ అప్లికేషన్‌ను ప్రారంభించనుంది. లండన్‌లోని బర్మింగ్‌హామ్‌సిటీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఈ అప్లికేషన్‌ను మొదలుపెట్టనుంది.

జియో‌ షాక్: 30 శాతం క్షీణించిన ఇంటెక్స్ విక్రయాలు

రిలయన్స్ జియో సంచలనాలతోనే మార్కెట్లోకి అడుగుపెట్టింది.ఉచిత వాయిస్‌కాల్స్, ఉచిత డేటాతో రిలయన్స్ జియో మార్కెట్లో సంచలనానికి కారణమైంది. జియో మార్కెట్లో రంగప్రవేశంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్‌లను మార్చాయి.

జియో బంపర్ ఆఫర్: ఐఫోన్ 10ఎక్స్‌పై 70% క్యాష్‌బ్యాక్

ఇతర టెలికం కంపెనీలు కూడ రిలయన్స్ జియో బాటలోనే పయనించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. జియో తరహలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్లను ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు ముందుకు వచ్చాయి.

జియోకు షాక్: 300 జీబీ 4జీ డేటా, ఉచిత కాల్స్ ఆఫరిచ్చిన ఎయిర్‌టెల్

జియో వర్చువల్ రియాలిటీ అప్లికేషన్

జియో వర్చువల్ రియాలిటీ అప్లికేషన్

2018 లో సొంత వర్చువల్ రియాలిటీ అప్లికేషన్‌ను ప్రారంభించాలని జియో రంగం సిద్దం చేసింది.ఈ మేరకు లండన్‌లోని బర్మింగ్‌హమ్ యూనివర్శిటీతో జియో చర్చలు జరుపుతోంది. తరువాతి తరం వర్చువల్ రియాలిటీ వృత్తి నిపుణులకి శిక్షణ ఇవ్వడం గురించి మరింత తెలుసుకోవడానికి బుధవారం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని యూనివర్శిటీ తెలిపింది.

 జియోతో కలిసి పనిచేసేందుకు రెడీ

జియోతో కలిసి పనిచేసేందుకు రెడీ

జియోతో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని బర్మింగ్‌హమ్ యూనివర్శిటీ ప్రకటించింది. భవిష్యత్‌లో సంభావ్య భాగస్వామ్యాలను విశ్లేషించడానికి యోచిస్తున్నట్టు జియో స్టూడియో హెడ్ ఆదిత్య భట్ క్రియేటివ్ డైరెక్టర్ అంకిత్ శర్మ బర్మింగ్‌భహామ్‌ యూనివర్శిటీని సందర్శించారు.

 90 మంది ఆర్టిస్టులతో టూర్

90 మంది ఆర్టిస్టులతో టూర్

దాదాపుమంది 90మంది ఆర్టిస్తులతో యూరోప్ , ఆసియాలోని అతిపెద్ద స్టూడియోలకు సినిమాలు, టెలివిజన్లలో కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజెస్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించే ఫిలిం సీఎంజీ స్టూడియో కూడా ఈ యూనివర్శిటీని సందర్శించింది. ముంబై, పుణేలలో ప్రముఖ యానిమేషన్‌ స్టూడియో వర్చువల్ రియాలిటీ, అగ్‌మెంట్‌ రియాలిటీ (ఎఆర్‌) సేవలవైపు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిలింసీజీఐ వ్యవస్థాపకుడు , మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ భానుషాలి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌ విభాగం ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్ అకాడమిక్స్‌తో చర్చించారు.

సంచలనాలకు వేదికగా జియో

సంచలనాలకు వేదికగా జియో

సంచలనాలకు జియో వేదికగా మారింది. మార్కెట్లోకి రావడంతోనే జియో సంచలనమైంది. మరోవైపు మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడ జియో ఆఫర్లతో సంచలనాలను సృష్టిస్తోంది. తాజాగా వర్చువల్ రియాలిటీ అప్లికేషన్‌ను ప్రారంభించాలనుకోవడం కూడ సంచలనంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The new entrant in the telecom industry, Reliance Jio, is planning to launch its own Virtual Reality (VR) app in 2018 and is hoping to collaborate with experts at Birmingham City University in England, the university said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి