7లో 2 కన్నయ్య మాట్లాడినవి కావు: బెయిలొచ్చింది
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో వివాదాస్పద కార్యక్రమానికి సంబంధించిన వీడియోల్లో రెండు కల్పిత వీడియోలున్నాయని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. వీడియోలో లేని వ్యక్తుల మాటలను వాటిలో చొప్పించారని నివేదిక స్పష్టంచేసింది.
జేఎన్‌యూలో భారత వ్యతిరేక నినాదాల ఘటనకు సంబంధించి మొత్తం ఏడు వీడియో క్లిప్పింగులను పరీక్షించాల్సిందిగా హైదరాబాద్‌లోని 'ట్రూత్ ల్యాబ్స్'ను ఢిల్లీ ప్రభుత్వం కోరింది. వాటిలో ఐదు మాత్రమే వాస్తవమైనవని పేర్కొంటూ.. తాజాగా తమ నివేదికను 'ట్రూత్ ల్యాబ్స్' సమర్పించింది.

బుధవారం ట్రూత్ ల్యాబ్ చీఫ్ గాంధీ మాట్లాడుతూ.. జేఎన్‌యూ ఆడియో, వీడియో టేపులను పరిశీలించామని తెలిపారు. కొన్ని చోట్ల కన్నయ్య మాటలను జోడించారని, మరికొన్ని చోట్ల వీడియో తొలగించారని చెప్పారు. కన్నయ్య మాట్లాడినట్లు వచ్చిన వ్యాఖ్యలు అతనివి కావని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం పంపిన 7 టేపుల్లో రెండు నకిలీవని తేల్చినట్లు తెలిపారు.
కాగా, మరోవైపు, దేశద్రోహం కేసులో అరెస్టైన జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలకు మంగళవారం ఢిల్లీ స్థానిక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇది ఇలా ఉండగా, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కన్నయ్య కుమార్‌కు బెయిల్
కన్నయ్య కుమార్‌కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అతనికి ఆరు నెలల పాటు బెయిల్ ఇచ్చింది. రెండు వారాలుగా కన్నయ్య కుమార్ జైలులో ఉంటున్నాడు. రూ.10వేలు, జెఎన్‌యూ ప్రొఫెసర్ పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. విచారణకు అందుబాటులో ఉండాలని సూచించింది. అతను రేపు విడుదలయ్యే అవకాశముంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications