నాకు ట్విటర్ ఖాతా లేదు: ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు: JNU కొత్త వీసీ శాంతిశ్రీ
ప్రతిష్టాత్మక ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్‌గా రెండ్రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ అప్పుడే వివాదాలు వెంటాడుతున్నాయి. ఇందుకు కారణం ఆమె చేసిన ట్వీట్లు కావడం విశేషం. అయితే ఈ ట్వీట్లపై శాంతిశ్రీ వివరణ ఇచ్చారు. తన పేరుతో ఎవరో ట్విటర్ ఖాతాను తెరచి వివాదాస్పద ట్వీట్లు చేసి తన ఇమేజ్‌కు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
" సోషల్ మీడియాలో నేను యాక్టివ్‌గా ఉండను. ట్విటర్ అకౌంట్ అస్సలు మెయిన్‌టెయిన్ చేయను. ఇది ఎవరో కావాలనే చేశారు. ఓర్వలేని వారు చేసిన పని ఇది" అంటూ వ్యాఖ్యానించారు పండిట్. శాంతిశ్రీ జేఎన్‌యూ తొలి మహిళా వైస్ ఛాన్సెలర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె పేరుతో ఉన్న ట్విటర్ అకౌంట్ నుంచి కొన్ని వివాదాస్పద ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. పలువురు ప్రముఖులు కూడా శాంతిశ్రీ నియామకాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని తెలిపారు.
Newly appointed Vice Chancellor of JNU. pic.twitter.com/tkxv9wAG4Z
— Mohammed Zubair (@zoo_bear) February 7, 2022

శాంతిశ్రీ పేరుతో ఉన్న ట్విటర్ ఖాతా నుంచి ఓ పోస్టు వచ్చింది. ఇది జాతిపిత మహాత్మాగాంధీని ఉద్దేశించి వచ్చిన ట్వీట్. మహాత్మాగాంధీ హత్యను నాథూరాంగాడ్సే సమర్థించడం సరైనదే అంటూ ట్వీట్ వచ్చింది. ఆ సమయంలో భారత్ సమగ్రంగా ఏకత్వంతో ఉండాలన్న ఉద్దేశంతో నాథూరాం ఈ పనిచేశారనే అర్థం వచ్చేలా ట్వీట్‌లో ఉంది. ఇక జామియా మరియు సెయింట్ స్టీఫెన్స్ కాలేజీల్లో జరిగిన మతఘర్షణలపై, రైతు ఉద్యమంపై కూడా వివాదాస్పద ట్వీట్లు ఈ ఖాతా నుంచి పోస్టు అయ్యాయి.అయితే సోమవారం సాయంత్రం నాటికి శాంతిశ్రీ పేరుతో ఉన్న ట్విటర్ అకౌంట్ డీ-యాక్టివేట్ అయ్యింది.












Click it and Unblock the Notifications