పెళ్లి పేరుతో రేప్: పీహెచ్ డీ స్కాలర్ అరెస్ట్, మోసం చేశాడంటూ మోడల్
న్యూఢిల్లీ: 26ఏళ్లయువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్ యూ) పీహెచ్ డీ స్కాలర్ ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అజయ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు విచారిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
2008 నుంచి నిందితుడు తనకు తెలుసని, 2010 నుంచి తనను పెళ్లి చేసుకుంటానని శరీరకంగా దగ్గరైనట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువతి డిమాండ్ చేసింది.

పెళ్లి పేరుతో మోడల్ పై అత్యాచారం
ఓ వాణిజ్య ప్రకటనల సంస్థ యజమాని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఓ వర్ధమాన మోడల్ అయిన 30 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని శాస్త్రినగర్ కు చెందిన వాణిజ్య ప్రకటనల సంస్థ యజమానితో మీరా రోడ్డు నివాసి అయిన 30 ఏళ్ల మోడల్ కు స్మార్ట్ ఫోన్ యాప్ లో ఫోటో షేరింగ్ ద్వారా పరిచయం ఏర్పడింది.
తరచూ చాటింగ్ చేస్తూ ఓ రోజు తన ఇంటికి రమ్మని మోడల్ ను ఆహ్వానించాడు. మోడల్ అయిన మహిళ తన ఇంటికి వెళ్లగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై బలవంతంగా అత్యాచారం జరిపాడు.
ఆ తర్వాత మోడల్ ఫోన్ చేసినా ఎత్తకుండా మోసం చేశాడు. దీనిపై ఆ మహిళ ఆరా తీస్తే సదరు వ్యక్తికి పెళ్లి అయిందని తనను మోసం చేశాడని తేలింది. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications