వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jodhpur riots: జోధ్ పూర్ అల్లర్లు, 140 మంది అరెస్టు, కర్ఫ్యూ పొడగింపు, రంజాన్ రోజు దెబ్బతో, వేట !

|
Google Oneindia TeluguNews

జోధ్ పూర్/జైపూర్: రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరిగిన మతఘర్షణల కారణంగా విధించిన కర్ఫ్యూ పొడగించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని జోధ్ పూర్ జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జోధ్ పూర్ లో మంగళవారం హిందూ, ముస్లీంల మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే.

Illegal affair: భార్య హత్య కేసులో జైల్లో భర్త, ప్రియుడితో కాపురం చేస్తున్న భార్య, థ్రిల్లర్ స్టోరి !Illegal affair: భార్య హత్య కేసులో జైల్లో భర్త, ప్రియుడితో కాపురం చేస్తున్న భార్య, థ్రిల్లర్ స్టోరి !

జోధ్ పూర్ లో జరిగిన మతఘర్షణల కారణంగా ఇప్పటి వరకు 140 మందిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. మే 6వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులను కర్ఫ్యూ నియమాలు, నిబంధనలు సడలించామని అధికారులు అన్నారు.

Jodhpur riots: Jodhpur communal violence 140 arrested so far curfew extended till may 6 Rajasthan.

రంజాన్ పండుగ సందర్బంగా జోధ్ పూర్ లోని జాలోరి గేట్ సమీపంలో జెండాలు ఎగరవేసే విషయంలో రెండు వర్గాల మద్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. రెండు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

Sketch: టేస్ట్ మార్చిన భార్య, మ్యాటర్ లీక్, లిక్కర్ పార్టీలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య !Sketch: టేస్ట్ మార్చిన భార్య, మ్యాటర్ లీక్, లిక్కర్ పార్టీలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య !

లాఠీచార్జ్ చేసినా పరిస్థితి చెయ్యిదాటడంతో పోలీసులు బాష్పవాయు ప్రయోగించారు. ఇదే సమయంలో కొందరు అల్లరిమూకలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చెయ్యడానికి విఫలయత్నం చేశారు. అయితే పోలీసులు సరైన సమయంలో స్పందించి కొంతమంది అల్లరిమూకలను చితకబాది వారిని అదుపులోకి తీసుకున్నారు. జోధ్ పూర్ మతఘర్షణల కేసులకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 140 మందిని అరెస్టు చేసి వారి మీద అనేక సెక్షల కింద కేసులు నమోదు చేశారు.

English summary
Jodhpur riots: Jodhpur communal violence 140 arrested so far curfew extended till may 6 Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X