యూపీ ఎన్నికల్లో ఓటు వేయని జయంత్ చౌదరి .. దురహంకారాన్ని నిదర్శమన్న జేపీ నడ్డా
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించిన రాజకీయ నేతలే ఇప్పటి వరకు వారి ఓటు హక్కును వినియోంచుకోలేదు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత జయంత్ చౌదరి ఓటు వేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజలను ఓట్లడిగే అర్హత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓటు వేయని జయంత్ చౌదరి
యూపీలో సమాజ్ వాదీ పార్టీతో ఆర్ఎల్డీ పొత్తు పెట్టుకుని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే తొలివిడత పోలింగ్‌లో జయంత్ చౌదరి తన ఓటు హక్కును వినియోగించుకోకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో బీజిగా ఉన్నందున తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయానని ఆయన చెప్పుకోచ్చారు. ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో జయంత్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

జయంత్‌పై నెటిజన్ల విమర్శలు
ప్రజలను పోలింగ్ బూతులకు తరలిరావాలి.. ఓటు వేయాలని పిలుపునిచ్చే నేతలే.. సాధ్యమైతే ఓటు వేస్తామంటూ వ్యాఖ్యలు చేయడం ఏంటని జయంత్ చౌదరిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోని వ్యక్తికి ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదని మండిపడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలే ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

దురహంకారానికి నిదర్శం
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ లో జయంత్ ఓటు వేయలేదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శించారు. ఓటు వేయకపోవడం వారి దురహంకారానికి నిదర్శమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. యూపీలోని బిస్వాన్‌లో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో బీజేపీ పార్టీ మాత్రమే జాతీయ పార్టీగా మిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగాను, సోదర సోదరీమణుల పార్టీగా మరిందని ఎద్దేవా చేశారు.
Recommended Video

తొలి విడత పోలింగ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కట్టుదిట్టమైన పోలీసుల భద్రత నడుమ ప్రశాంతంగా జరుగుతుంది.. ఉదయం 7:00 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4:00 గంటల వరకు 48.24 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications