Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగ్రవాదుల పట్ల అఖిలేష్ యాదవ్ కు అంత ప్రేమ ఎందుకో.. ఎస్పీపై మండిపడ్డ జేపీ నడ్డా

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా బుధవారం ప్రకటించారు. గోరఖ్‌పూర్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను టార్గెట్ చేశారు. బీజేపీ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వంపై ఉత్తరప్రదేశ్‌ ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. మార్చి 10న మా ప్రభుత్వం మరోసారి ఏర్పాటు కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ భారీ మెజారిటీతో గెలవబోతున్నామని పేర్కొన్నారు.

యూపీలోని గోరఖ్‌పూర్‌తోపాటు ఇతర నగరాల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లను ప్రస్తావించిన ఆయన.. ఉగ్రవాదులను సోషలిస్టులు ఎందుకు అంతగా ప్రేమిస్తారో అఖిలేష్ యాదవ్ సమాధానం చెప్పాలని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హయాంలో రాష్ట్రం విధ్వంస బాటలో పయనిస్తోందని బీజేపీ చీఫ్ ఆయనపై మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఒకవైపు విధ్వంసం , మరోవైపు అభివృద్ధి ఉన్నాయని, ప్రజల అభివృద్ధి వైపు పయనిస్తున్నారని జేపీ నడ్డా పేర్కొన్నారు. అధికారం కోసం యూపీ విధ్వంస మార్గంలో పయనిస్తే అఖిలేష్ యాదవ్‌కు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఇదే సమయంలో ఉగ్రవాదుల పట్ల అఖిలేష్ యాదవ్ కు అంత ప్రేమ ఎందుకో చెప్పాలని జేపీ నడ్డా ప్రశ్నించారు. సమాజ్వాది పార్టీ కోసం అహ్మదాబాద్ బాంబు పేలుళ్లలో దోషి అయిన ఉగ్రవాది తండ్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆరోపించారు.

JP Nadda targets Akhilesh Yadav for why Samajwadi party loves terrorists so much

బీజేపీకి అనుకూలంగా ఓటర్లు ఉన్నారని, వారి ఉత్సాహాన్ని తాను చూశానని నడ్డా పేర్కొన్నారు. అభివృద్ధి, భద్రత మరియు శ్రేయస్సు కోసం ఓటు వేయడానికి ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి పెద్ద పీట వేసిన ప్రధాని నరేంద్ర మోడీ మరియు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను జేపీ నడ్డా కొనియాడారు. పేదలు, మహిళలు, యువత సాధికారత కోసం బీజేపీ పని చేసిందని ఆయన అన్నారు. గోరఖ్‌పూర్‌లో అటల్ మెడికల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రారంభించబడిందని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి . రాష్ట్రంలో నాలుగో దశ ఎన్నికలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ముఖ్యంగా గోరఖ్‌పూర్ అర్బన్, గోరఖ్‌పూర్ రూరల్ నియోజకవర్గాలకు ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లో మిగిలిన మూడు దశలకు ఫిబ్రవరి 27, మార్చి 3, 7 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా.. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+