వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత జవాన్లతో తాజా ఘర్షణల వెనుక చైనా మాస్టర్ ప్లాన్: ఫిఫ్త్ జనరేషన్ అల్ట్రా మోడర్న్ ఫైటర్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు ఉద్దేశపూరకంగానే సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చాయి. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావాలనేది చైనా సైనికులు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, రెచ్చగొట్టే ప్రయత్నం కూడా కాదని భారత ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే పీఎల్ఏ బలగాలు సరిహద్దులను దాటడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయని భావిస్తున్నారు.

హోటన్ ఎయిర్ బేస్‌లో అత్యాధునిక యుద్ధ విమానాలు..

హోటన్ ఎయిర్ బేస్‌లో అత్యాధునిక యుద్ధ విమానాలు..


ఈ నెల 29, 30 తేదీల్లో రాత్రి వేళ పంగ్యాంగ్ త్సొ లేక్ సమీపంలో వాస్తవాధీన రేఖను దాటుకుని భారత్ వైపు రావడానికి చైనా సైనికులు ప్రయత్నించినట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. 29 కంటే ముందే.. సరిహద్దుల్లో అత్యాధునిక యుద్ధ విమానాలను చైనా వైమానిక దళం మోహరింపజేసిందని తెలుస్తోంది. అత్యాధునికమైన జే-20 యుద్ధ విమానాలను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్) సరిహద్దుల వద్ద మోహరింపజేసిందని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. భారత్-చైనా సరిహద్దులకు అతి సమీపంలో నిర్మించిన హోటన్ ఎయిర్ బేస్‌లో ఈ యుద్ధ విమానాలను మోహరించిందని చెబుతున్నారు.

రాఫెల్‌తో సరితూగగల సామర్థ్యం..

రాఫెల్‌తో సరితూగగల సామర్థ్యం..

భారత వైమానిక దళం అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రంగా భావించ దగ్గ రాఫెల్ యుద్ధ విమానాలకు సరితూగగల శక్తి సామర్థ్యాలు ఈ జే-20 జెట్ ఫైటర్లకు ఉన్నాయని తెలుస్తోంది. ట్విన్ ఇంజిన్ గల జే-20 యుద్ధ విమానాలు 34000 నుంచి 37000 కేజీల బరువును టేకాఫ్ వెయిట్‌గా మోయగలవు. జే-20తో పోల్చుకుంటే రాఫెల్ యుద్ధ విమానాలు 24,500 కిలోల బరువును మోయగలవు. 3400 కిలోమీటర్ల రేంజ‌ను జే-20 కలిగి ఉంటుంది. గంటకు 2100 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణించగలదు. ఒకేసారి నాలుగు క్షిపణులను సంధించగలిగే సామర్థ్యం దానికి ఉంది.

భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న అనంతరం రెండోసారి..

భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న అనంతరం రెండోసారి..

భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న తరువాత జే-20 యుద్ధ విమానాలను చైనా వైమానిక దళం హోటన్ ఎయిర్ బేస్‌లో మోహరింపజేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు- గాల్వన్ వ్యాలీలో రెండు దేశాల మధ్య ప్రాణాంతక దాడులు, ప్రతిదాడుల తరువాత తొలిసారిగా ఈ రకం యుద్ధ విమానాలను హోటన్ ఎయిర్‌బేస్‌కు తరలించింది చైనా. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో ఉద్రిక్తతలు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో వాటిని వెనక్కి రప్పించింది.

ఎన్‌గరి కున్షా ఎయిర్‌పోర్టులోనూ..

ఎన్‌గరి కున్షా ఎయిర్‌పోర్టులోనూ..

తాజాగా- పంగ్యాంగ్ త్సొ లేక్ వద్ద ఘర్షణలు చోటు చేసుకోవడానికి రెండు రోజుల ముందే.. వాటిని మళ్లీ మోహరింపజేసిందని మనదేశ ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సారి కొత్తగా ఎన్‌గారి కున్షా ఎయిర్ పోర్టు‌ను కూడా దీనికోసం వినియోగించుకుందని భావిస్తున్నారు. భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడాలని, ఆ దేశ భూభాగంపైకి చొచ్చుకుని వెళ్లాలని చైనా ముందుగానే మాస్టర్ ప్లాన్ పన్నిందనడానికి ఇవే సాక్ష్యాలని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఈ ఘర్షణలను చైనా సైన్యం ఎక్కడిదాకా తీసుకెళ్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమౌతోంది.

Recommended Video

Jio Fiber : 399/- కే జియో ఫైబర్ ప్లాన్... 30 రోజులు ఉచితంగా ట్రయల్స్! || Oneindia Telugu
పంగ్యాంగ్ త్సొ లేక్ వద్ద..

పంగ్యాంగ్ త్సొ లేక్ వద్ద..

నిజానికి వాస్తవాధీన రేఖ వెంట గల సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను చైనా బలగాలు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోయాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాయి. గాల్వన్ వ్యాలీని ప్రాంతాన్ని మాత్రమే ఖాళీ చేసిన చైనా.. పంగ్యాంగ్ త్సొ లేక్ దక్షిణ ప్రాంతంలో మాత్రం యధాతథంగా కొనసాగుతోంది. ఈ ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయాలంటూ భారత ఆర్మీ అధికారులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చైనాపై చర్చల ద్వారా ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఒకవంక కొనసాగుతుండగానే.. అదే పంగ్యాంగ్ త్సొ లేక్ ప్రాంతంలో సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

English summary
Days before the Chinese Army tried to carry out fresh transgressions near the Southern bank of Pangong Tso lake, the People's Liberation Army's Air Force (PLAAF) redeployed its J-20 fifth-generation fighter aircraft near Ladakh for operational deployment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X