లేటు వయసులో ఎన్డీ తివారీ ఘాటు పెళ్లి(పిక్చర్స్)
న్యూఢిల్లీ/లక్నో: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్ తివారీ తన 88వ యేట మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. ఒకప్పటి సహచరి, రోహిత్ శేఖర్ తల్లి అయిన ఉజ్వలా శర్మ(62)ను ఆయన గురువారం ఉదయం లక్నోలో వివాహమాడారు. వివాహ వేడుక అనంతరం ఉజ్వలా శర్మ మీడియాతో మాట్లాడారు.
వివాహ ప్రతిపాదనను తివారీ తన ముందుకు తెచ్చారని, ఈ వేడుక కొద్దమంది సమక్షంలోనే జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఈ వివాహా కార్యక్రమానికి కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
కాగా, 2008లో రోహిత్ శేఖర్ తనను కొడుకుగా గుర్తించాలని ఎన్డీ తివారీపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో దావా వేసిన విషయం తెలిసిందే. అయితే తివారీ మాత్రం తను రోహిత్ తండ్రినన్న అభియోగాన్ని ఖండించటమే గాక, డిఎన్ఏ పరీక్షకు కూడా మొదట అంగీకరించలేదు. అయితే కోర్టు కల్పించుకోవడంతో రోహిత్ విజయం సాధించాడు. ఇటీవలే రోహిత్ శేఖర్ తన కుమారుడేనని తివారీ ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతని తల్లి ఉజ్వలా శర్మను తివారీ వివాహం చేసున్నట్లు తెలుస్తోంది.
ఎన్డీ తివారీ 1967లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశారు. ఆ సమయంలోనే కృష్ణమీనన్ మార్గ్‌లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తివారీ తరచూ వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో షేర్ సింగ్ కూతురు ఉజ్వలా శర్మకు తివారీకి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి రోహిత్ శేఖర్ జన్మించాడు. కాగా, ఎట్టకేలకు వీరిద్దరూ పెళ్లితో మళ్లీ ఒక్కటయ్యారు.

పెళ్లి కొడుకైన ఎన్డీ తివారీ
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్ తివారీ తన 88వ యేట మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు.

పెళ్లి కొడుకైన ఎన్డీ తివారీ
ఒకప్పటి సహచరి, రోహిత్ శేఖర్ తల్లి అయిన ఉజ్వలా శర్మ(62)ను ఆయన గురువారం ఉదయం లక్నోలో వివాహమాడారు. వివాహ వేడుక అనంతరం ఉజ్వలా శర్మ మీడియాతో మాట్లాడారు.

పెళ్లి కొడుకైన ఎన్డీ తివారీ
వివాహ వేడుక అనంతరం ఉజ్వలా శర్మ మీడియాతో మాట్లాడుతూ.. వివాహ ప్రతిపాదనను తివారీ తన ముందుకు తెచ్చారని, ఈ వేడుక కొద్దమంది సమక్షంలోనే జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పారు.

పెళ్లి కొడుకైన ఎన్డీ తివారీ
2008లో రోహిత్ శేఖర్ తనను కొడుకుగా గుర్తించాలని ఎన్డీ తివారీపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో దావా వేసిన విషయం తెలిసిందే. అయితే తివారీ మాత్రం తను రోహిత్ తండ్రినన్న అభియోగాన్ని ఖండించటమే గాక, డిఎన్ఏ పరీక్షకు కూడా మొదట అంగీకరించలేదు. అయితే కోర్టు కల్పించుకోవడంతో రోహిత్ విజయం సాధించాడు. ఇటీవలే రోహిత్ శేఖర్ తన కుమారుడేనని తివారీ ఒప్పుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications