ఎట్టకేలకు తగ్గారు.. సారీ చెప్తా: జస్టిస్ కర్ణన్ కేసులో మరో ట్విస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారణ కేసులో మరో ట్విస్ట్. ఎట్టకేలకు ఆయన తగ్గారు. కోర్టు ధిక్కార కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకుఆయన తరపు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఓ అభ్యర్థన పత్రాన్ని న్యాయస్థానానికి అందజేయగా దానిని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది.

దీంతో పాటు కర్ణన్‌ అరెస్టుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డరుపై స్టే విధించాల్సిందిగా కోరుతూ పిటీషన్‌ దాఖలు చేశారు. న్యాయమూర్తులు అందుబాటులో ఉన్న సమయంలో ఆ పిటీషన్‌ను విచారిస్తామని తెలిపింది.

karnan

కోర్టు ధిక్కార కేసులో జస్టిస్‌ కర్ణన్‌ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మూడు రోజుల క్రితం ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

వెంటనే కర్ణన్‌ను అరెస్టు చేసి, శిక్ష అమలు చేయాలని కోల్‌కతా పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దేశంలోని కొందరు న్యాయమూర్తులు, న్యాయవాదులు అవినీతికి పాల్పడినట్లు కర్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Friday refused to urgently hear a petition filed by Justice C S Karnan. I may be arrested anytime and hence the matter should be heard urgently, Justice Karnan's lawyer said on his behalf. As a result of this the police can go ahead and arrest Justice Karnan.
Please Wait while comments are loading...