వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో మరో సీినియర్ జడ్జి నియామకం: నల్సా ఛైర్మన్‌గా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో న్యాయసేవలను అందించే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నియామకం పూర్తయింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (UU Lalit) ఆ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనను నామినేట్ చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా యుయు లలిత్ బాధ్యతలను స్వీకరిస్తారు.

ఇదివరకు జాతీయ న్యాయ సేవా అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనసాగారు. ఇక ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించడంతో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి యుయు లలిత్‌ను రాష్ట్రపతి నామినేట్ చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తరువాత రెండో సీనియర్ న్యాయమూర్తి ఆయనే. కాగా- ఈ అథారిటీకి చీఫ్ ప్యాట్రన్‌గా జస్టిస్ ఎన్వీ రమణ కొనసాగుతారు. న్యాయ సేవా అథారిటీ చట్టం 1987కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది.

Justice UU Lalit the next executive chairman of the National Legal Services Authority

బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సేవలను అందించడానికి ఉద్దేశించిన అథారిటీ ఇది. రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన న్యాయ సేవా అథారిటీకి ఆయా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో కూడా ఈ అథారిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ యుఆర్ లలిత్ కుమారుడు యుయు లలిత్. బోంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్ అదనపు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు.

1983లో బోంబే హైకోర్టు అడ్వొకేట్‌గా ఆయన ప్రాక్టీస్‌ చేపట్టారు. 1986 నుంచి 1992 వరకు మాజీ అటార్నీ జనరల్ సొలి సొరాబ్జి ఛాంబర్స్‌లో పనిచేశారు. సుప్రీంకోర్టు లీగ్ సర్వీసెస్ కమిటీ సీనియర్ అడ్వొకేట్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఏకే గంగూలిలతో కూడిన బెంచ్.. లలిత్‌ను సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Recommended Video

Cyclone Tauktae : తుఫాన్ ఉగ్రరూపం Gujarat వద్ద తీరాన్ని, విషాదకర ఘటనలు...! || Oneindia Telugu

English summary
President Ram Nath Kovind on Monday nominated Justice Uday Umesh Lalit the next executive chairman of the National Legal Services Authority (NALSA) with immediate effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X