Kangana: ఫైర్ బ్రాండ్ కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్, కౌంటర్ గా కంగనా మరో పోస్టు, తగ్గేదేలే !

న్యూఢిల్లీ/ముంబాయి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మరోసారి ఇబ్బందులు ఎదురైనాయి. సిక్కులను కించపరిచి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఇప్పటికే ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారు. నిత్యం ఏదోఒక టాపిక్ తో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నటి కంగనా రనౌత్ కు ఇప్పుడు సిక్కుల మనోభావాలు దెబ్బతినే విదంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ కమీటి సమన్లు జారీ చేసింది. నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ సిక్కులు ఇప్పటికే ఆమె మీద కేసు పెట్టారు. డిసెంబర్ 6వ తేదీన నటి కంగనా ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ ముందు హాజరుకావలసి ఉంది. అయితే మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో కంగనా రనౌత్ తనదైన శైలిలో మరోపోస్టు చేశారు. మరో రోజు మరో ఎఫ్ఐఆర్, నన్ను అరెస్టు చెయ్యడానికి వస్తే ఇంటి దగ్గర నా మూడ్ ఇలా ఉంటుంది అంటూ కంగనా రనౌత్ వైన్ తాగుతున్న సమయంలో తీసిన ఓ పాత ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చెయ్యడంతో మరో సారి ఆమె హాట్ టాపిక్ గా నిలిచింది.

 కంగనా అంటేనా ఆ విషయంలో కేరాఫ్ అడ్రస్

కంగనా అంటేనా ఆ విషయంలో కేరాఫ్ అడ్రస్


వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మరోసారి ఇబ్బందులు ఎదురైనాయి. సిక్కులను కించపరిచి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చెయ్యడంతో ఇప్పటికే ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దెబ్బతో ఇప్పుడు కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

 మోదీ ప్రభుత్వం ప్రకటనతో పండగ చేసుకుంటున్నారని ?

మోదీ ప్రభుత్వం ప్రకటనతో పండగ చేసుకుంటున్నారని ?

ఇటీవల సాగు చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చెయ్యడంతో రైతులు ఆంనందంలో మునిగితేలుతున్నారు. అయితే ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పుడు సంతోషంగా పండుగ చేసుకుంటుంటే వారి మీద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దూమరంరేపాయి.

కేసు పెట్టిన సిక్కు నాయకులు

కేసు పెట్టిన సిక్కు నాయకులు

నటి కంగనా మా మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ఢిల్లీ గురుద్వార్ మేనేజ్ మెంట్ కమిటీ నాయకులు ఢిల్లీలోని సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్ లో ఆమె మీద కేసు పెట్టారు. సిక్కులను కించపరిచి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఢిల్లీ పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు.

 సమన్లు జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ

సమన్లు జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ

సిక్కుల మనోభావాలు దెబ్బతినే విదంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్యం కమిటీ ( ప్యానెల్) బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు సమన్లు జారీ చేసింది. నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ సిక్కులు ఇప్పటికే ఆమె మీద కేసు పెట్టారు. ఈనెల 20వ తేదీన మీ ఇన్ స్టాగ్రామ్ లో మీరే సిక్కులను కించపరిచే విదంగా పోస్టు చేశారని, అందుకే సమన్లు జారీ చేశామని ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ సమన్లలో వివరించింది. డిసెంబర్ 6వ తేదీన నటి కంగనా అమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది.

 వైన్ గ్లాస్ చేతిలో పెట్టుకున్న ఫోటో పెట్టిన కంగనా మేడమ్

వైన్ గ్లాస్ చేతిలో పెట్టుకున్న ఫోటో పెట్టిన కంగనా మేడమ్

తన మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని తెలుసుకున్న నటి కంగనా రనౌత్ మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో తనదైన శైలిలో మరోపోస్టు చేశారు. మరో రోజు మరో ఎఫ్ఐఆర్, నన్ను అరెస్టు చెయ్యడానికి వస్తే ఇంటి దగ్గర నా మూడ్ ఇలా ఉంటుంది అంటూ కంగనా రనౌత్ వైన్ గ్లాస్ చేతిలో పట్టుకుని ఉన్న సమయంలో తీసిన ఓ పాత ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చెయ్యడంతో మరో సారి ఆమె హాట్ టాపిక్ గా నిలిచింది.

కొందరికి మాత్రం టైమ్ పాస్ అవుతోంది

కొందరికి మాత్రం టైమ్ పాస్ అవుతోంది


మొత్తం మీద నటి కంగనా రనౌత్ దెబ్బతో కొంత మందికి టైమ్ పాస్ అవుతుంటే మరి కొంత మంది ఆమె తీరుతో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే నటి కంగనా రనౌత్ డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ ముందు హాజరౌతుందా ?, లేదా ? అనే విషయం మాత్రం వేచిచూడాల్సిందే అని ఆమె అభిమానులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+