శాంతిని కాపాండండి, వాటిని పట్టించుకోవద్దు, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి, చాలెంజింగ్ స్టార్ !
బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల సందర్బంగా తన అభిమానులు శాంతిని కాపాడాలని చాలెంజింగ్ స్టార్ దర్శన్ మనవి చేశారు. మండ్య లోక్ సభ ఎన్నికలు సవ్యంగా జరగడానికి తన ప్రతి అభిమాని సహకరించాలని, ప్రత్యర్థుల ఆరోపణలు పట్టించుకోరాదని దర్శన్ మనవి చేశారు.
మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, ప్రముఖ నటి సుమలత పోటీ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుమలతకు స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరోలు దర్శన్, యష్ మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు.

దర్శన్, యష్ ల ఎన్నికల ప్రచారాన్ని జీర్ణించుకోలేని కొందరు జేడీఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో వారిని నీచంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. జేడీఎస్ కార్యకర్తల తీరుపై దర్శన్ అభిమానులు మండిపడుతున్నారు. జేడీఎస్ నాయకులు, కార్యకర్తలకు వ్యతిరేకంగా దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఈ విషయాలు మొత్తం గమనించిన హీరో దర్శన్ తన ఫేస్ బుక్, ట్వీట్టర్ లో అభిమానులకు మనవి చేస్తూ పోస్టు చేశారు. ఎన్నికల సమయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజం అని, వాటిని సీరియస్ గా తీసుకోకూడదని దర్శన్ మనవి చేశారు.
తన మీద విమర్శలు చేస్తున్నారని అభిమానులు ఎలాంటి ఆందోళన చెయ్యకూడదని, ఎన్నికలు సవ్యంగా జరగడానికి అందరూ సహకరించాలని దర్శన్ మనవి చేశారు. సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్న ఇలాంటి ప్రచారాల గురించి అభిమానులు కొంచెం కూడా పట్టించుకోకూడదని దర్శన్ తెలిపారు.












Click it and Unblock the Notifications