ఇస్రో చైర్మన్ కు ప్రతిష్టాత్మక అవార్డు, అవార్డుతో పాటు ఎంత బంగారు, ఎన్ని లక్షలు ఇస్తారంటే !
బెంగళూరు: కర్ణాటకతో పాటు కన్నడిగులు నివాసం ఉంటున్న దేశ విదేశాల్లో నవంబర్ 1వ తేదీ బుధవారం కన్నడ రాజ్యోత్సోవం వేడుకలు చాలా ఘనంగా, వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో 2023 కన్నడ రాజ్యోత్సవ అవార్డుల విజేతల జాబితాలో బీదర్ జిల్లాకు చెందిన ఇద్దరు 100 ఏళ్ల వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లు ఉండటం విశేషం.
కర్ణాటకలోని ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరు చొప్పున అవార్డులు అందజేస్తామని కర్ణాటక కన్నడ, సాంస్కృతిక శాఖా మంత్రి శివరాజ్ ఎస్ తంగడగి తెలిపారు. కన్నడ రాజ్యోత్సవ అవార్డు (2023) అందుకుంటున్న వ్యక్తులు, వారి వివరాలను మంత్రి ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 68 మందికి కన్నడ రాజ్యోత్సవ అవార్డులు అందజేయనున్నట్లు మంత్రి శివరాజ్ తంగడగి తెలిపారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కూడిన కమిటీకి వచ్చిన వేలాది దరఖాస్తుల్లో 68 మందిని కన్నడ రాజ్యోత్సవం అవార్డుకు ఎంపిక చేసినట్లు మంత్రి శివరాజ్ తంగడిగ తెలిపారు. కన్నడ రాజ్యత్సవ అవార్డు అందుకుంటున్న వారిలో ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ కూడా ఉన్నారు. కొప్పళ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి తన రెండు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన హుచ్చమ్మ అనే మహిళకు కన్నడ రాజ్యోత్స అవార్డు అందిస్తున్నారు.
హుచ్చమ్మ సామాజ సేవను కర్ణాటక ప్రభుత్వం గుర్తించిందని మంత్రి శివరాజ్ తంగడిగ అన్నారు. కన్నడ రాజ్యోత్సవ అవార్డుకు హుచ్చమ్మ దరఖాస్తు చేసుకోనప్పటికీ ప్రభుత్వమే హుచ్చమ్మతో సహా ఏడెనిమిది మందిని అవార్డుకు ఎంపిక చేసిందని మంత్రి శివరాజ్ తంగడిగ వివరించారు. సంగీతం, నృత్యం, సినిమా, కళ, సామాజ సేవ, మీడియా, వైద్యం, క్రీడలు, విద్యతో పాటు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులకు కన్నడ రాజ్యోత్సవ అవార్డులు ప్రకటిస్తారు.

కన్నడ రాజ్యోత్సవ అవార్డులో భాగంగా 25 గ్రాముల బంగారు పతకం, రూ. 5 లక్షల నగదు బహుమతి అవార్డు గ్రహితలకు అందిస్తున్నారు. అవార్డుకు ఎంపికైన వారికి నవంబర్ 1వ తేదీన కన్నడ రాజ్యోత్సవంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో అవార్డును అందజేయనున్నట్లు మంత్రి శివరాజ్ తంగడిగ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం 68వ కన్నడ రాజ్యోత్సవం వేడుకల సందర్భంగా చలనచిత్రం, సాహిత్యం, కళాకారులు, సామాజ సేవతో సహ వివిధ రంగాలకు చెందిన 68 మందిని సత్కరించి కన్నడ రాజ్యోత్సవ అవార్డు అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications