వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎమ్మెల్యే మీద దాడి, సెక్యూరిటీ ఇవ్వండి, ప్రభుత్వానికి స్పీకర్ ఆదేశం, గూండాలు, రచ్చరచ్చ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ సమావేశాలు గురువారం ప్రారంభం అయిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు రచ్చరచ్చ చేశారు. స్పీకర్ రమేష్ కుమార్ చాంబర్ దగ్గరకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హాసన్ ఎమ్మెల్యే ప్రీతం గౌడ మీద, ఆయన ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావించిన బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో గూండాలు ఎక్కువ అయ్యారని, ఎమ్మెల్యే మీద దాడి చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఏమి రక్షణ కల్పిస్తుందని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.

Karnata Speaker has directed the State Government to give more security to Hassan BJP MLA

బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్న సమయంలోనే బడ్జెట్ సమావేశంలో భాగంగా గవర్నర్ చేసిన ప్రసంగానికి శాసన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్ కు సభ్యులు ఆమోదం తెలిపారు.

కర్ణాటకలోని రెండు విశ్వవిధ్యాలయాల్లో రెండు నామినేనెడ్ పదవులు భర్తి చెయ్యాలని ఉప ముఖ్యమంత్రి డాకర్ట్ జీ. పరమేశ్వర్ మనవి చేశారు. ఎమ్మెల్యే ప్రీతం గౌడ మీద దాడికి జేడీఎస్ నాయకులు ప్రయత్నించారని, వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

ఈ విషయంపై మాట్లాడిన స్పీకర్ రమేష్ కుమార్ వెంటనే ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ, ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. సభ రచ్చరచ్చ కావడంతో మద్నహం 3 గంటలకు వాయిదా వేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు అభినందించారు.

English summary
Karnataka Assembly Session 2019: Speaker Ramesh Kumar has directed the State Government to give more security to Hassan BJP MLA Preetham Gowda, who's house was allegedly attacked on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X