మీ ఒక్కఓటు కర్ణాటక భవిష్యత్తును నిర్ణయిస్తుంది, మార్పు కోసం ఓటెయ్యండి: ప్రియాంకా గాంధీ
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్ర ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని నిర్వహించి కర్ణాటక ప్రజల మద్దతును చూరగొనే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాల్లో, 2613 మంది అభ్యర్థులు నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో జరగనున్న లోక్‌సభ పై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు, దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తూ దేశం మొత్తం కర్ణాటక ఎన్నికలను ఆసక్తికరంగా తిలకిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని శతవిధాలా ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ, పోలింగ్ రోజున కూడా ఓటర్లను,తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తుంది.

ఇందులో భాగంగా ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వంట గ్యాస్ సిలిండర్ కు పూజచేసి, హారతిచ్చి, ఓటు వేయడానికి వెళ్లేముందు ఖచ్చితంగా అందరూ ఈ పని చేసి వెళ్లాలని చెబితే, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ట్విట్టర్ వేదికగా కన్నడ భాషలో ఒక పోస్ట్ చేశారు. మార్పు కోసం ఓటు వెయ్యాలన్నారు.
ಆತ್ಮೀಯ ಕನ್ನಡಿಗರೇ,
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 10, 2023
ಇಂದು ತಪ್ಪದೇ ಮತ ನೀಡಿ. ಬದಲಾವಣೆಗಾಗಿ ಮತ ನೀಡಿ. 40% ಭ್ರಷ್ಟಾಚಾರ ನಿಲ್ಲಿಸಲು ಮತ ನೀಡಿ. ಬೆಲೆ ಏರಿಕೆ ತಡೆಯಲು ಮತ ನೀಡಿ, ಅಭಿವೃದ್ಧಿಯ 5 ಗ್ಯಾರಂಟಿಗಳಿಗಾಗಿ ಮತ ನೀಡಿ.
ಕರ್ನಾಟಕದ ಅಸ್ಮಿತೆಯನ್ನು ಕಾಪಾಡಲು ಮತ ನೀಡಿ. ಬಡವರು ನೆಮ್ಮದಿಯಾಗಿ ಬದುಕಲು ಮತ ನೀಡಿ. ಕರ್ನಾಟಕವನ್ನು ಸರ್ವ ಜನಾಂಗದ ಶಾಂತಿಯ… pic.twitter.com/OCK59u1Dpl
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లో ప్రియమైన కన్నడిగులారా..ఈ రోజు తప్పకుండా ఓటు వేయండి. మార్పుకోసం ఓటువేయండి. అవినీతిని అరికట్టేందుకు ఇప్పటికే 40 శాతం మంది ఓట్లు వేశారు అంటూ పోస్ట్ చేసారు. అంతేకాదు, ధరల పెరుగుదలను ఆపడానికి , కర్ణాటక అభివృద్ధికి తాము ఇచ్చిన ఐదు హామీలను నెరవేర్చడానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
కర్ణాటక గుర్తింపును కాపాడడానికి, పేదలు సుఖంగా జీవించడానికి ఓటు వేయాలన్నారు.కర్ణాటకను అన్ని వర్గాల వారు నివసించే శాంతియుతమైన తోటగా మార్చడానికి ఓటు వేయాలన్నారు. మీ ఒక్క ఓటు కర్ణాటక భవిష్యత్తును నిర్ణయిస్తుందని, కాబట్టి రాష్ట్ర అభివృద్ధి మరియు పురోగతికి ఓటు వేయాలని తాను అభ్యర్థిస్తున్నానని ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications