కట్టప్ప సీఎం చెప్పినట్లు వీళ్లు ఆడుతున్నారు, డీసీఎం మిస్సింగ్ పోస్టర్ల కలకలం, మోదీ మార్క్ తో!

బెంగళూరు: కావేరి జలాల పంపకాల విషయంలో దశాభ్దాల నుంచి కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలు నిత్యం పోట్లాడుకుంటూనే ఉన్నాయి. కావేరి జలాల పంపకాల విషయంలో ఇప్పటికే అనేక గొడవలు జరిగాయి, బెంగళూరులో (Bengaluru)నివాసం ఉంటున్న కోటి మందికి పైగా ప్రజలు నిత్యం కావేరి నీటినే ఉపయోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి కావేరి నీటి వివాదం ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది.

బెంగళూరు (Bengaluru)నగరంలో నివాసం ఉంటున్న లక్ష్లలాది మంది తమిళ సోదరులు నిత్యం తాగుతున్నది కావేరి నీరు (water) అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బెంగళూరు (Bengaluru) నగరంలో సుమారు 35 లక్షల మందికిపైగా తమిళ (Tamil) ప్రజలు నివాసం ఉంటున్నారని, తమిళనాడుకు (tamil nadu) చెందిన చాలా మంది వ్యాపారులు బెంగళూరులో ఫ్యాక్టరీలు, పరిశ్రమలు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారని, లక్షలాది మంది తమిళ ప్రజలు ఉద్యోగాలు చేస్తున్నారని కన్నడిగులు అంటున్నారు.

Karnataka BJP leaders are campaigning for the missing posters of DK Shivakumar

ఇంత తెలిసినా తమిళనాడు (tamil nadu) ప్రభుత్వం మొండిగా మాకు రావాలసిన కావేరీ నీరు (water) వాటా మాకు వదిలేయండి అంటూ మొండి పట్టుపడుతోంది. కేఆర్ఎస్ డ్యామ్ లో కావేరి నీటి (water) మట్టం తగ్గిపోయినా, కర్ణాటకలో వర్షాలు పడకపోయినా తమిళనాడు (tamil nadu) ప్రభుత్వం కావేరి నీటి కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు మరోసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణం అయ్యింది.

ఇదే సందర్బంలో కర్ణాటకలోని కాంగ్రెస్ (congress) ప్రభుత్వం మీద బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారని, కేంద్రంలో కాంగ్రెస్ కు (congress)మద్దతు ఇస్తున్న స్టాలిన్ ను ప్రసన్నం చేసుకోవడానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ (dk shivakumar) తమిళనాడు అడిగినన్ని కావేరీ నీరు (water) వదిలేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.

Tamil Nadu CM MK Stalin

కట్టప్ప (kattappa) అనే స్టాలిన్ ఆదేశాల మేరకు కర్ణాటక నీటిపారుదల శాఖా మంత్రి, డీసీఎం డీకే శివకుమార్ తమిళనాడుకు కావేరీ నీరు (water) విడుదల చేస్తున్నారని, కన్నడిగుల కడుపుకొడుతున్నారని ఆరోపిస్తూ కర్ణాటక బీజేపీ శాఖ ట్విట్టర్ (X)లో ఆరోపించింది. కట్టప్ప (kattappa)అనే స్టాలిన్ ఆదేశాలు పాటిస్తున్న డీసీఎం డీకే శివకుమార్ (dk shivakumar)కనపడటం లేదని, దయచేసి వెతికిపెట్టాలని బీజేపీ వ్యంగంగా పోస్టర్లు విడుదల చేసింది.

డీకే శివకుమార్ (dk shivakumar) ఆచూకి చెప్పిన వాళ్లకు ఐదు ఉచిత హామీలు అందిస్తామని ప్రత్యేకంగా పోస్టర్లు ముద్రించిన బీజేపీ నాయకులు వాటిని బెంగళూరుతో పాటు వివిద ప్రాంతాల్లో అతికిస్తున్నారు. తమిళనాడు (tamil nadu) సీఎం ఎంకే. స్టాలిన్ ను బాహుబలి (baahubali) సినిమాలోని కట్టప్పతో పోల్చుతూ డీకే శివకుమార్ కనపడటం లేదనే మిస్సింగ్ పోస్టర్లను బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+