karnataka సీఎంకు బీజేపీ భారీ షాక్ -యడ్డీ దింపివేతకు హైకమాండ్ కసరత్తు -అర్జున్ సింగ్ టూర్‌పై టెన్షన్
కర్ణాటకలో అధికార బీజేపీలో కొనసాగుతోన్న కుమ్ములాటలు చివరికి సిట్టింగ్ సీఎంను కుర్చీ దించేయాలనే లక్ష్యాన్ని చేరినట్లున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్పను పదవి నుంచి తొలగించి, మరో నేతకు పాలనా పగ్గాలు అప్పగించాలనే దిశగా బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు మీడియా రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆల్ ఈజ్ వెల్ అని ఢిల్లీ దూతలు చెబుతున్నప్పటికీ యడ్డీ ఊస్టింగ్ తప్పేలా లేదని తెలుస్తోంది..

హైకమాండ్ నిర్ణయం..
మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధం లేనట్లుగా, అధికారుల పట్ల అదోరకం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోన్న యడ్యూరప్పను సీఎం పదవి నుంచి తొలగించాల్సిందేనంటూ అసంతృప్త నేతలు చాలా కాలంగా పట్టుపడుతున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా అసమ్మతి నేతల వాదనకు తలొగ్గారని తెలుసుకున్నారేమో, యడ్యూరప్ప సైతం 'హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పదవిని వదులుకోడానికి సిద్ధం' ఇటీవలే ప్రకటించారు. యడ్యూరప్ప పనితీరుపై అసమ్మతి నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆయనను తప్పించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుందని హైకమాండ్ కు సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు

బెంగళూరుకు అర్జున్ సింగ్
కర్ణాటక బీజేపీ ఇంచార్జి అర్జున్ సింగ్ మాత్రం యడియూరప్పనే సీఎంగా కొనసాగుతారని, మళ్లీ ఎన్నికల వరకు రాష్ట్రానికి ఆయనే సారధిగా ఉంటారని స్సష్టం చేశారు. బీజేపీ కర్నాటక శాఖ సైతం ఇదే మాట చెబుతున్నది. కరోనా మహమ్మారిని యడ్డీ సారథ్యంలో కర్నాటక ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కొందని, మంత్రులు, ఎమ్మెల్యేలు బాగా పనిచేశారని అరుణ్ సింగ్ కొనియాడారు. తక్షణం బెంగళూరు వెళ్లి అసమ్మతి నేతలతో మాట్లాడి సమస్యలు సర్ధుబాటు చేస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే,

యడ్డీ తొలగింపు ఖాయమేనా?
అర్జున్ సింగ్ బెంగళూరు పర్యటనలో అసమ్మతి నేతల్ని కలిసి ఒక రిపోర్టు తయారుచేసి హైకమాండ్ కు సమర్పిస్తారని, బెంగళూరు పర్యటనకు ముందే ఆయన చెప్పినట్లు యడ్డీకి అనుకూలంగా రిపోర్టు వెళ్లే అవకాశాలున్నాయని, కానీ వాస్తవంలో మాత్రం సీఎం తొలగింపునకు హైకమాండ్ ఇటీవలే నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాల మాటగా జాతీయ మీడియా పేర్కొంది. నాయకత్వ మార్పు వ్యవహారం, అసమ్మతి నేతల కట్టడిపై అరుణ్ సింగ్ ఓవైపు కసరత్తు సాగిస్తుండగానే యడియూరప్పను పాలనా పగ్గాల నుంచి తప్పించడంపై బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ప్రచారం సాగుతుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications