Karnataka Polls : యోగీని రప్పించండి.. కర్నాటక బీజేపీ నేతల డిమాండ్..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితా కూడా ప్రకటించిన బీజేపీ.. విపక్ష కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో బీజేపీని గట్టెక్కిచేందుకు అధిష్టానం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో యూపీ సీఎం, ఫైర్ బ్రాండ్ నేత యోగీ ఆదిత్యనాథ్ ను ప్రచారానికి రప్పించాలని బీజేపీ స్ధానిక నేతలు కోరుతున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకరుగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ తన ఎన్నికల ర్యాలీలను గణనీయంగా పెంచుకుంది. మాఫియాలు, నేరగాళ్లపై కఠిన చర్యలతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మంచి పేరుంది. తాజాగా యూపీలో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్, గులామ్‌ల ఎన్‌కౌంటర్‌తో, 'మిట్టి మీ మిలా దేంగే' వ్యాఖ్యలతో యోగీ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ నేపథ్యంలో యూపీ నుంచి యోగీని రప్పిస్తే ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందని వారు చెప్తున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో.. కర్నాటక బీజేపీ నేతలు యోగీతో ప్రచారం చేయించాలనే డిమాండ్ ను అధిష్టానానికి వినిపిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా యోగీని కర్నాటకకు రప్పించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కర్ణాటక బీజేపీ నాయకులు సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణ, కఠినమైన ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా హిందూత్వ ప్రధాన సమస్యగా ఉన్న కోస్తా కర్ణాటకలో యోగి ఆదిత్యనాథ్ మరిన్ని ర్యాలీలు నిర్వహించాలని వారు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications