కర్నాటక కేబినెట్ విస్తరణ- యడ్యూరప్ప టీమ్‌లో నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు
కర్నాటకలో అసమ్మతి, లుకలుకలతో సాగిపోతున్న యడియూరప్ప ప్రభుత్వం ఇవాళ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంతో అసమ్మతిగా ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఈ విస్తరణ చేపట్టారు. ఇందులో ఏడుగురు కొత్త వారికి మంత్రులుగా చోటు దక్కింది.
కర్నాటక రాజ్‌భవన్‌లో జరిగిన కేబినెట్ విస్తరణలో గవర్నర్ వాజూభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా మంత్రులుగా అవకాశం దక్కిన వారిలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేష్ కట్టి(హక్కేరి), ఎస్.అంగర(సల్లియా), మురుగేష్ నిరానీ (బిల్గీ), అరవింద్ లింబావలీ(మహదేవపుర), ఎమ్మెల్సీలు ఆర్.శంకర్, ఎంటీబీ నాగరాజ్, సీపీ యోగేశ్వర్ ఉన్నారు. కేబినెట్‌లో తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు కల్పించారు.

2019 జూలైలో అధికారం చేపట్టిన తర్వాత యడియూరప్ప సర్కారుకు ఇది మూడో కేబినెట్ విస్తరణ. 17 ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కాంగ్రెస్-జేడీ ఎస్ ప్రభుత్వం కుప్పకూలడంతో అధికారంలోకి వచ్చిన యడియూరప్పకు సొంత పార్టీలో అసంతృప్తులు, తిరుగుబాటు దారులు ఎక్కువ కావడంతో ప్రభుత్వానికి సమస్యలు తప్పడం లేదు. త్వరలో యడియూరప్పనే తప్పించి మరొకరికి సీఎం పగ్గాలు అప్పగించాలని కూడా అధిష్టానం గతంలో భావించింది. కానీ తాత్కాలికంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications