Karnataka: కర్నాటక ఎన్నికల తర్వాతా కూటముల్లేవ్- జేడీఎస్ కు మరో షాకిచ్చిన పీసీసీ ఛీఫ్ డీకే..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమంటూ వెలువడుతున్న సర్వే నివేదికలు ఆ పార్టీలో జోష్ నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ పొత్తులు లేకుండానే బరిలోకి దిగుతోంది. అలాగే ఎన్నికల తర్వాత జేడీఎస్ తో సంకీర్ణం ఏర్పాటు చేస్తుందా లేదా అనే చర్చ కూడా మొదలైంది. దీనిపై పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చేశారు.
ఈ ఏడాది మేలో జరిగే కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీని ఎదుర్కోవడానికి జనతాదళ్-సెక్యులర్ (జెడి-ఎస్)తో జట్టుకట్టే అవకాశాల్లేవని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తేల్చిచెప్పేశారు. గతంలో జేడీఎస్ తో జట్టుకట్టి చేదు అనుభవాలు ఎదుర్కొన్న నేపథ్యంలో డీకే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మూడింట రెండు వంతుల సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని డీకే శివకుమార్ జోస్యం చెప్పారు.

తమకు ఏ రాజకీయ పార్టీతో పొత్తు అక్కర్లేదని, మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామని చాలా నమ్మకంగా ఉన్నామని, బీజేపీకి రెట్టింపు సీట్లు వస్తాయని జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో డీకే స్పష్టం చేశారు. కర్నాటకలో కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉందని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేశామని శివకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంతో కర్ణాటక ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు.












Click it and Unblock the Notifications