డీసీఎంతో పాటు ఆ రెండు శాఖలు డీల్ చేసిన డీకేశీ, ఆ ఒక్కటి అడక్కు అని సిద్దూ, రాజీతో !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి రంగం సిద్దం అయ్యింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇదే సమయంలో ఓ ఖాతా గురించి సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య చాలాసేపు వాడివేడిగా చర్చ జరిగిందని, అయితే ఆ ఖాతా మాత్రం నువ్వు అడగవద్దు శివకుమార్ అంటూ సిద్దరామయ్య అన్నారని వెలుగు చూసింది.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి సిద్దరామయ్యకు ఇవ్వడానికి డీకే శివకుమార్ అంగీకరించారు. రెండున్నర సంవత్సరాల తరువాత సిద్దరామయ్య ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి ఆ పదవిని డీకే శివకుమార్ కు అప్పగించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రితో పాటు రెండు ఖాతాలను తనకు ఇవ్వాలని డీకే శివకుమార్ కాబోయే సీఎం సిద్దరామయ్య ముందు డిమాండ్ చేశారు.

dk-shivakumar-siddaramaiah

ఆర్థిక మంత్రిత్వ శాఖా, జలసంపన్నుల శాఖా తనకు కావాలని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందే సిద్దరామయ్యను అడిగారని తెలిసింది. అయితే సీఎం పదవితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన దగ్గరే ఉంటుందని, ఆర్థిక శాఖ తాను ఎవ్వరికి ఇవ్వనని, కావాలంటే నువ్వు ఏ శాఖ అడిగితే అది ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నానని సిద్దరామయ్య కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు చెప్పారని సమచారం.

ఆర్థిక శాఖ దక్కకపోవడంతో డిప్యూటీ సీఎంతో పాటు బెంగళూరు నగర అభివృద్ది శాఖ, నీటిపారుదల శాఖ తనకు కావాలని డీకే శివకుమార్ అడిగారని, ఆ రెండు శాఖలు డీకే శివకుమార్ కు ఇవ్వడానికి సిద్దరామయ్య అంగీకరించారని తెలిసింది. ఉప ముఖ్యమంత్రితో పాటు రెండు ప్రధానమైన శాఖలు ఇప్పుడు డీకే శివకుమార్ చేతిలోకి వెళ్లిపోతున్నాయి.

 vidhansouda-

మే 20వ తేదీ శనివారం బెంగళూరు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు మొదటి విడతలో 20 మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సిద్దరామయ్య వర్గంలోని 10 మంది ఎమ్మెల్యేలు, డీకే శివకుమార్ వర్గంలోని 10 మంది ఎమ్మెల్యేలు మొదటి విడతలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా ఇంతకాలం తమ వెంట ఉన్న నాయకులు, ఊహించని విదంగా ఎమ్మెల్యేలు అయిన నాయకులను మంత్రులు చెయ్యాలని సిద్దరామయ్య, డీకే శివకుమార్ బావించారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+