కర్ణాటక ఎఫెక్ట్: బీజేపీకి ఊహించని షాకిచ్చిన కాంగ్రెస్, తెరపైకి గోవా

పనాజీ: ఓ వైపు కర్ణాటకలో ట్విస్ట్ కొనసాగుతుండగా మరోవైపు తెరపైకి గోవా వచ్చింది. కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. యడ్యూరప్ప తనకు బలం ఉందని చెబుతూ అందుకు సంబంధించిన వివరాలను అందించారు.

దీంతో కాంగ్రెస్ నేతలు తెరపైకి గోవాను తీసుకు వచ్చారు. గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ తమదేనని, తమకు అధికారం కావాలని అంటున్నారు. కర్ణాటక రాజకీయం గోవాను తాకడంతో ఇది మరింత ఆసక్తికరంగా మారింది.

Karnataka effect: Now Goa Congress stakes claim to form govt

గోవాలో రేపు (శుక్రవారం) రాజ్ భవన్ ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరేడ్ నిర్వహించాలని నిర్ణయించారు. గోవాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 40. ఇందులో కాంగ్రెస్‌కు 17, బీజేపీకి 13 వచ్చాయి. స్వతంత్రులు, చిన్న పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కర్ణాటక ప్రభావం నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం గవర్నర్‌ను కలిసి అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా కోరనున్నారు.

గోవాలో బీజేపీ స్థానిక ఎంజీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలువలేదని కర్ణాటక కాంగ్రెస్ - జేడీఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ గోవాలో గవర్నర్ ఎదుట పరేడ్ నిర్వహించాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+