కర్ణాటక ప్రతిష్టాత్మకం: భారీగా పెరిగిన అభ్యర్థుల ఖర్చు, భారీ ఓటింగ్ ఎవరికి లాభం?

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చుపెట్టడం గమనార్హం. గతంలో కంటే ఏకంగా 70శాతం అధికంగా ఖర్చులు పెరిగిపోవడం గమనార్హం.

సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎంఎస్) అభ్యర్థులపై ఖర్చుపై చేసిన సర్వేలో ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి. అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలిపింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా రూ.9,500-10,500కోట్లు ఖర్చయినట్లు తేల్చింది.

ఇది ఇలా ఉండగా, కర్ణాటకలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ మారు ఓట్ల శాతం పెరిగింది. ఇది దేనికి సంకేతం? ఏ పార్టీ లాభపడుతుంది? నిజంగా జేడీఎస్‌ నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తుందా? బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏ పార్టీ అయినా స్పష్టమైన మెజారిటీ సాధిస్తాయా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

Karnataka elections most expensive ever in terms of expenditure by parties, candidates: Survey

2004, 2008 ఎన్నికల్లో దాదాపు 65% ఓటింగ్‌ నమోదుకాగా.. 2013లో అది 71.45%కు పెరిగింది. ఈ సారి అంతకన్నా ఎక్కువగా 72.13 శాతం నమోదైంది. 1952 తర్వాత ఇదే అత్యధిక శాతం ఓటింగ్‌. గ్రామీణ ప్రాంతాల్లో సగటున 85.01 శాతం ఓట్లు పోలయ్యాయి.

పాత మైసూరు, బొంబాయి కర్ణాటకల్లో ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉంది. పెరిగిన ఓట్ల శాతం తమకు లాభిస్తుందంటే.. తమకు లాభిస్తుందని బీజేపీ, కాంగ్రెస్‌లు ధీమా ప్రదర్శిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+