మూడు పార్టీలతో ఫుట్ బాల్ ఆడుకున్న గాలి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతు చాలా మంది నాయకుల జీవితాలు తారుమారు అయ్యాయి. చాలా మంది నాయకుల రాజకీయ జీవితానికి చెక్ పడటంతో మరికొంత మంది నాయకులకు ఓటర్లు రాజకీయ భిక్ష పెట్టారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాదించారు.
కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, బళ్లారి శ్రీరాములు శక్తి వంచన లేకుండా పని చేశారు. అయితే అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితం పూర్తిగా తల్లకిందులు అయ్యింది.

గత డిసెంబర్ నెలలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ (కేఆర్ పీపీ) పెట్టి బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు. కోప్పళ జిల్లాలోని గంగావతి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఫుట్ బాల్ సింబల్ మీద పోటీ చేసిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 8 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల నుంచి ఎంతో సీనియర్ నాయకులు పోటీలో ఉన్నా గంగావతిలో సొంత పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి మూడు పార్టీల నాయకులతో ఫుట్ బాల్ ఆడుకుని ఆయన సత్తా చాటుకున్నారు. తన రాజకీయ జీవితానికి చెక్ పెట్టాలని అనుకున్న నాయకులకు గాలి జనార్దన్ రెడ్డి సరైన బుద్ది చెప్పారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
సిద్దరామయ్యను సీఎం చేస్తే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వస్తుండటం. మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి ఏ పార్టీకి మద్దతు ఇస్తారు ? అనే విషయం వేచి చూడాలని రాజకీయ నాయకులు అంటున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications