Forest: ఇంట్లోదూరి రైతును చితకబాదిన అటవి శాఖ అధికారులు !
బెంగళూరు/ తుమకూరు: అడవిని ఆక్రమించుకున్న రైతు దర్జాగా వ్యవసాయం చేస్తున్నాడని ఆరోపిస్తూ అటవి శాఖ అధికారులు ఆ రైతు ఇంట్లో దూరి చితకబాదిన సంఘటన కలకలం రేపింది. రైతు ఇంట్లో ఉంటే అటవి శాఖ అధికారులు, సిబ్బంది దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Khiladi:
ప్రియుడితో
రొమాన్స్,
ఆంటీ
భర్త
ఏం
చేశాడంటే,
అంత్యక్రియల
టైమ్
లో
ట్విస్ట్!
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలుకాలోని నల్లూరు గ్రామం సమీపంలోని చేళూరులో బసవరాజ్ అనే రైతు ఉన్నాడు. అటవి శాఖకు చెందిన భూమిని రైతు బసవరాజ్ ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

నువ్వు ఎందుకు అటవి శాఖ భూమిని ఆక్రమించుకున్నావని ఇంత వరకు రైతు బసవరాజ్ ను అటవి శాఖ అధికారులు ప్రశ్నించలేదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిసింది. ఇంట్లో భోజనం చెయ్యడానికి ప్లేట్ ముందు పెట్టుకున్న బసవరాజ్ కు అతని భార్య అన్నం వడ్డిస్తున్న సమయంలో అటవి శాఖకు చెందిన కొందరు అధికారులు అతని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Lovers:
రెండు
నెలల
క్రితం
పెళ్లి,
ఇంట్లో
ఏకాంతంగా
ఉంటే
ఇద్దరిని
నరికి
చంపిన
అమ్మాయి
తండ్రి,
దెబ్బకు!
మద్యం మత్తులో ఉన్న అటవి శాఖ అధికారులు తనను మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వకుండా కర్రలు తీసుకుని చితకబాదేశారని, వెంటనే అక్రమించుకున్న భూమిని వదిలేయాలని తన మీద దౌర్జన్యం చేశారని బసవరాజ్ పోలీసులను ఆశ్రయించారు. భోజనం చేస్తున్న బసవరాజ్ ను అతని ఇంట్లోకి దూరి చితకబాదేశారని, వెంటనే అటవి శాఖ అధికారులు, సిబ్బంది మీద కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేస్తూ రైతు బసవరాజ్, అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో గుబ్బి తాలుకాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.