మరో వివాదంలో మాజీ సీఎం, నాడ గీతం పాడుతుంటే కాళ్లు, చేతులు ఊపుతూ, నోటితో !

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర విధాన సౌధలో ప్రధాన పత్రిపక్ష నాయకుడు (కాంగ్రెస్) సిద్దరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. దావణగెరెలోని హరిహరలో ఇందిరా క్యాంటిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాడగీతం (కర్ణాటక గీతం) ఆలపించే సమయంలో నిర్లక్షంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో పలువురు నాయకులు, అధికార బీజేపీ నాయకులు సిద్దరామయ్య తీరుపై మండిపడుతున్నారు.

దావణగెరె జిల్లాలోని హరిహరలో ఇందిరా క్యాంటిన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరైనారు. ఆ సమయంలో ఇందిరా క్యాంటిన్ ప్రారంభించిన తరువాత కర్ణాటక నాడ గీతం ఆలపించారు. ఆ సందర్బంలో అదే వేదిక మీద మాజీ సీఎం సిద్దరామయ్య ఉన్నారు.

Karnataka former CM Siddaramaiah insulted naada geethe in Davanagere.

కన్నడ నాడ గీతం ఆలపిస్తున్న సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్య కాళ్లు చేతులు అళ్లాడిస్తూ నోటిలో ఏదో తిని మిగిలిన పదార్థాలను బయటకు ఉంచుతూ కనిపించారు. అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాల్లో సిద్దరామయ్య చేష్టల దృశ్యాలు రికార్డు అయ్యాయి.

వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఆ కార్యక్రమానికి హాజరైన ప్రజలు సైతం మాజీ సీఎం సిద్దరామయ్య తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిద్దరామయ్య చేష్టల వీడియో మీడియాలో ప్రసారం కావడంతో వైరల్ అయ్యింది. సిద్దరామయ్య నాడ గీతం ను అవమానించారని బీజేపీ నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇందిరా క్యాంటిన్ ప్రారంభించిన తరువాత సిద్దరామయ్య అక్కడే పలావ్ ఆరగించారు. ఇందిరా క్యాంటిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. మల్లికార్జున్, మాజీ మంత్రులు తదితరులు హాజరైనారు. ఇంత జరిగినా మాజీ సీఎం సిద్దరామయ్య ఈ విషయంలో ఇంత వరకు వివరణ ఇవ్వకపోవడంతో బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించడానికి వారి చేతికి మంచి అస్త్రం చిక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+