
BJP vs Congress: గుజరాత్ లో బీజేపీది దిక్కుమాలిన గెలుపు, మా కొంప ముంచింది ?, సిద్దూ !
బెంగళూరు/అహమ్మదాబాద్/సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి మా పార్టీ గట్టిపోటీ ఇచ్చిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య అన్నారు. గుజరాత్ లో బీజేపీ గెలుపు ఓ దిక్కుమాలిన గెలుపులాంటిదే అని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పరోక్షంగా అన్నారు. గుజరాత్ లో చీపురు పార్టీ మా కొంప ముంచిందని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు. గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సిద్దరామ్య జోస్యం చెప్పారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపించవని మాజీ సీఎం సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం ఎన్నికల ప్రభావం మరో రాష్ట్రం మీద కచ్చితంగా ఉండవని సిద్దరామయ్య అన్నారు.
Romance:
దుబాయ్
లో
మొగుడు,
ఖాళీగా
ఉన్నానని
కుర్రాడితో
ఆంటీ
?,
క్లైమాక్స్
లో
ఎంతపని
జరిగింది
?

గుజరాత్ మ్యాటర్ లో మాకు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనకబడింది ? అనే విషయంలో మాజీ సీఎం సిద్దరామయ్య జోస్యం చెప్పారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్బంగా కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. గుజరాత్ లో బీజేపీ మళ్లీ అధికారంలో రావడం మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

చీపురు పార్టీ మాకొంప ముంచింది
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోవడానికి అప్ ఆద్మీ పార్టీ (ఆప్) కారణం అని మాజీ సీఎం సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆప్ కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు భారీగా చీలిపోయాయని, బీజేపీకి ఓటు బ్యాంకు అలాగే ఉండిపోయిందని, అందుకే గుజరాత్ లో మా పార్టీ అధికారంలోకి రావడానికి కష్టం అయ్యిందని మాజీ సీఎం సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

హిమాచల్ ప్రదేశ్ కు నేను వెళ్లలేదు.... కానీ ?
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో దూసుకుపోతుందని మాకు సమాచారం అందింది. ఎందకంటే ఆక్కడికి నేను వెళ్లలేదు. ప్రచారం చెయ్యలేదు. కానీ మా పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో అంత సీన్ లేదు..... ఢిల్లీలో ఏం జరిగింది ?
గుజరాత్ ఎన్నికల ఫలితాలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపించవని మాజీ సీఎం సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం ఎన్నికల ప్రభావం మరో రాష్ట్రం మీద కచ్చితంగా ఉండవని సిద్దరామయ్య అన్నారు. ఎందుకంటే ఢిల్లీలో అలాంటి ప్రభావం చూపించి ఉంటే బీజేపీ ఎందుకు విజయం సాధించలేదని మాజీ సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మొత్తం మీద గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సిద్దరామ్య జోస్యం చెప్పారు. కర్ణాటకలో గుజరాత్ ప్రభావం చూపించదని సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం సిద్దరామయ్య జోస్యం చెప్పారు. కర్ణాటకలో మరోసారి బీజేపీకి అధికారం ఇవ్వడానికి ఇక్కడి ప్రజలు సిద్దంగా లేరని సిద్దరామయ్య అన్నారు. వేరే పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలో వస్తోందని మాజీ సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.