వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా లాక్‌డౌన్: వాట్సాప్‌లో లిస్ట్ ఇస్తే.. ఇంటికే నిత్యావసర సరుకులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను కర్ణాటక రాష్ట్రంలో కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఓ కొత్త ఆలోచనను అమలు చేస్తోంది. నిత్యావసరాలను ప్రజల ఇంటివద్దకే పంపించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ నెంబర్‌ను కూడా కేటాయించింది.

సరుకులు అవసరం ఉన్నవారు సంబంధిత వాట్సాప్ నెంబర్‌కు సరుకుల జాబితాను పంపిస్తే సరిపోతుంది. స్థానిక ఏజెంట్లుసరుకులను ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప 08061914960 హెల్ప్ లైన్ నెంబర్ ను ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా బెంగళూరులోనే ప్రారంభిస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా తెలిపారు.

Karnataka Govt to Facilitate Doorstep Delivery of Groceries, Orders Via WhatsApp

ఇందు కోసం వివిధ ప్రైవేటు సంస్థల నుంచి బెంగళూరు నగరంలో దాదాపు 5వేల మంది ఏజెంట్లు పనిచేస్తారని తెలిపారు. దీంతో నిత్యావసర వస్తువుల కోసం బయటికి వచ్చేవారి సంఖ్య తగ్గుతుందన్నారు.

సరుకులు ఎలా పొందాలనే విషయాన్ని కూడా అధికారులు వెల్లడించారు.

మొదటగా 08061914960 నెంబర్ ను ప్రజలు తమ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలతి.
హెల్ప్ లైన్ నెంబర్ కు HI మెసేజ్ పెట్టి, మీ లోకేషన్ ను లేడా అడ్రస్ ను షేర్ చేయాలి.
మీకునిత్యావసర సరుకులు కావాలా? మెడిసిన్ కావాలా? అని అడుగుతుంది.
కావాల్సిన సరుకులను టైప్ చేసిగానీ, ఓ పేపర్ పై రాసి గానీ ఆ ఫొటోను పంపించాలి.
ఆ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్లు మీకు రిప్లై కూడా వస్తుంది.
ఆ తర్వాత సదరు ఏజెంట్ మీకు సరుకులు తీసుకొచ్చి ఇస్తారు.
బిల్లు చెల్లిస్తే చాలు, అయితే, డెలివరీ ఛార్జీల కింద రూ. 10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

English summary
Karnataka Chief Minister BS Yediyurappa on Tuesday officially launched the helpline service for home delivery of essential items and groceries in a bid to ensure that people remain indoors amid the coronavirus pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X