వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఐఎంతో కలిసి బీజేపీ కుట్ర: హైదరాబాద్ లో చర్చలు, సాక్షాలు ఉన్నాయి, మంత్రి రెడ్డి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీజేపీ నాయకులు, హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం అధ్యక్షుడు అసాదుద్దిన్ ఓవైసీ రహస్యంగా చర్చలు జరిపారని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి బాంబు పేల్చారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఎంతకైనా దిగజారుతారు అనే విషయం స్పష్టం చెయ్యడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. సోమవారం బెంగళూరులోని శక్తి భవన్ లో మీడియాతో మాట్టాడిన మంత్రి రామలింగా రెడ్డి బీజేపీ మీద దుమ్మెత్తిపోశారు.

ఉత్తరప్రదేశ్ ప్లాన్

ఉత్తరప్రదేశ్ ప్లాన్

ఉత్తర ప్రదేశ్ లో గత సంవత్సరం జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఎంఐఎం నాయకుడు అసాదుద్దీన్ ఓవైసీతో కుమ్మక్కు అయ్యి ముస్లీం సోదరులు ఎక్కవగా ఉంటున్న ప్రాంతాల్లో పోటీ చేయించారని, అక్కడ ముస్లీం ఓట్లు చీలిపోవడంతో బీజేపీ నాయకులు గెలిచారని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి ఆరోపించారు.

 హైదారాబాద్ లో చర్చ

హైదారాబాద్ లో చర్చ

బీజేపీ నాయకులు హైదరాబాద్ లో ఎంఐఎం నాయకుడు అసాదుద్దిన్ ఓవైసీతో భేటీ అయ్యి కర్ణాటకలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో ముస్లీంలు ఎక్కువగా ఉన్న చోట్ల పోటీ చేయించి ఆ వర్గం ఓట్లు చీల్చడానికి చర్చలు జరిపారని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి ఆరోపించారు.

 సాక్షాలు ఉన్నాయి

సాక్షాలు ఉన్నాయి

బీజేపీ నాయకులు, ఎంఐఎం నాయకుడు అసాదుద్దీన్ ఓవైసీతో చర్చలు జరిపినట్లు తమ దగ్గర సాక్షాలు ఉన్నాయని, అవసరం అయితే బయటపెడుతామని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. ముస్లీం ఓట్లు చీల్చి కాంగ్రెస్ కు నష్టం కలిగించి బీజేపీ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నదని రామలింగా రెడ్డి ఆరోపించారు.

 బీజేపీ బుద్ది బయటపడింది

బీజేపీ బుద్ది బయటపడింది

ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారితో కాంగ్రెస్ పార్టీకి లింక్ ఉందని ఆరోపిస్తున్న బీజేపీ ఎంఐఎం నాయకుడు అసాదుద్దీన్ ఓవైసీతో ఎలా చర్చలు జరుపుతారని రామలింగా రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నాయకులు అసలు బుద్ది ఇప్పుడు బయటపడిందని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు.

యూపీ ప్లాన్ కర్ణాటకలో !

యూపీ ప్లాన్ కర్ణాటకలో !

గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అనేక సంస్థలతో రహస్యంగా ఒప్పందం చేసుకుని ముస్లీం సోదరుల ఓట్లు చీల్చారని, ఇప్పుడు కర్ణాటకలో పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ, ఎంఐఎంతో ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీని దెబ్బ తియ్యడానికి కుట్ర చేస్తోందని, ఈ విషమంపై మా దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి మీడియాకు చెప్పారు.

English summary
Home Minister Ramalinga reddy accused that BJP is discussing with Owaisi in Hyderabad to supporting upcoming state assembly elections. He was talking to the reporters at shakti bhavan said that BJP has aligned with some anti national organizations in UP elections also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X