బీజేపీ ఎఫెక్ట్: కువత్తూరు రిసార్ట్ లో ఎందుకు ఐటీ దాడులు జరగలేదు, ఎవరు టార్టెట్, కాంగ్రెస్ !
రాజ్యసభ్య ఎన్నికల్లో బీజేపీ నాయకులు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికే ఆదాయపన్ను శాఖ అధికారులను అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి.
న్యూఢి/బెంగళూరు: రాజ్యసభ్య ఎన్నికల్లో బీజేపీ నాయకులు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికే ఆదాయపన్ను శాఖ అధికారులను అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాల మండిపడుతున్నారు.
బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుజరాత్ శాసన సభ్యులు ఉన్నారని, కావాలని అధికార దుర్వినియోగం చేసి ఆదాయపన్ను శాఖ అధికారులతో దాడులు చేయించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాల ఆరోపించారు.

గత ఫిబ్రవరి నెలలో చెన్నై నగర శివార్లలోని కువత్తూరు రిసార్ట్ లో అన్నాడీఎంకే పార్టీ శాసన సభ్యులు వారం రోజుల పాటు ఉంటే అప్పుడు ఎందుకు ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యలేదని ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయనే ఇప్పుడు ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారని రణదీప్ సుర్జీవాల మండిపడ్డారు.
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు డీకే. సురేష్, ఎంఎల్ సీ రవిని టార్గెట్ చేసుకుని ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారని, ఇలాంటి దాడులకు తమ పార్టీ భయపడదని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖార్గే అన్నారు.












Click it and Unblock the Notifications