సమస్యలు ఎప్పుడుండేవే: ఎమ్మెల్యేల విదేశీటూర్‌పై సిఎం

బెంగళూరు: కర్నాటక ఎమ్మెల్యేల స్టడీ టూర్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని పార్టీలకు చెందిన పలు పార్టీల శాసన సభ్యులు ముప్పై మంది వరకు అధ్యయనం కోసం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇప్పటికే ఓ ఎమ్మెల్యేల బృందం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫిజిలకు బయలుదేరి వెళ్లారు.

మరో బృందం త్వరలో బ్రెజిల్, అర్జెంటీనా, పెరూలలో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ రెండు పర్యటనలు అక్కడి దేశాల్లో అధ్యయనం చేసేందుకు అని కాంగ్రెసు ప్రభుత్వం చెబుతోంది.

Karnataka MLAs in mood of foreign tour

అయితే ఈ పర్యటనపై విమర్శలు వస్తున్నాయి. ఓ పక్క రాష్ట్రంలో కరువు నెలకొని ప్రజలు ఇబ్బందులతో సతమతమవుతుంటే ఎమ్మెల్యేల విహార యాత్రలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా స్టడీ టూర్ పైన విమర్శలు గుప్పిస్తోంది. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం సరికాదని బిజెపి మండిపడింది.

యాత్రలకు ఇది తగిన సమయం కాదని చెబుతోంది. అధ్యయనం పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ పర్యటనలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్థించుకుంటున్నారు. అధ్యయన పర్యటనలకు సమయం ఉంటూ ఉండదని, రాష్ట్రం అన్నాక ఎప్పుడూ ఏవో సమస్యలు ఉంటాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+