ఐటీ హబ్ లో దేశద్రోహి, అక్కడే చదివి అక్కడే ఉద్యోగం చేస్తూ ఏం చేశాడంటే ?
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కాశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తిని ఐటీ హబ్ బెంగళూరు నగర శివార్లలోని మదనాయకనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. ఫహీమ్ ఫిర్ దాస్ ఖురేషీ అలియాస్ ఫహీమ్ అరెస్టు అయిన నిందితుడు అని పోలీసు అధికారులు తెలిపారు. ఫహీమ్ చాలా సంవత్సరాల క్రితమే కాశ్మీర్ నుంచి బెంగుళూరు వచ్చి అక్కడే చదువుకున్నాడు.
చదువు పూర్తి చేసిన ఫహీమ్ బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ గూడ్స్ (బీఐఈసీ) లో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. భారతదేశం,జాతీయ సెంటిమెంట్‌ను దెబ్బతీసి సామాజిక శాంతిని ధ్వంసం చేసే వక్రబుద్ధి కలిగిన ఫాహీమ్ ఫిర్ దోస్ ఖురేషీ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్ లో భారతదేశానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు అనేక పోస్ట్‌లు పెట్టాడు. దేశ ద్రోహ కార్యకలాపాలకు ఇతను పాల్పడ్డాడు.

ఫహీమ్ చేసిన పోస్టులను కొందరు దేశ వ్యతిరేకులు కూడా మెచ్చుకున్నారు. ఇదే సమయంలో దేశ వ్యతిరేకులు ఫహీమ్ కు మద్దతు పలికారని తెలిసింది. ఈ నేపథ్యంలో విద్రోహ చర్యకు పాల్పడిన ఫహీమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఫహీమ్ ల్యాప్‌టాప్, బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఫహీమ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని మాదనాయకనహళ్లి పోలీసులు అధికారులు తెలిపారు.
ఫహీమ్ నివాసం ఉంటున్న బెంగళూరులోని పీణ్యా ప్లాటినం సిటీ అపార్ట్‌మెంట్ లో, అతను ఉద్యోగం చేస్తున్న బీఐఈసీలో సోదాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఖురేషీ ఉపయోగించిన ల్యాప్‌టాప్, బైక్, మొబైల్‌ను స్వాధీనం చేసుకుని మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షల కింద కేసు నమోదు చేశారు. ఫహీమ్ తో ఎవరెవరు టచ్ లో ఉన్నారు. కాశ్మీర్ లోని ఉగ్రవాదులతో ఇతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications