రసవత్తరంగా కర్ణాటక రాజకీయం... సాయంత్రం కల్లా తేల్చుతానంటున్న యడ్యూరప్ప..?
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరి పాకన పడింది. కాంగ్రెస్ ,జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు 13 మంది శనివారం రాజీనామ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరలేసింది. ఇక మరో పది ఎమ్మెల్యేలు కూడ రాజీనామ చేసేందుకు సిద్దంగా ఉన్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేత సిద్దరామయ్య తనతో 5 నుండి 6నేతలు టచ్‌లోనే ఉన్నారని చెబుతున్నారు.ఇక అమేరికా వెళ్లిన సీఎం కుమారస్వామి సాయత్రం తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. మరో రాజీనామ చేసిన ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్ క్యాంప్ వేశారు.

కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రెండవ రోజు కొనసాగుతుంది..దీంతో పాటు మరికొద్ది మంది ఎమ్మెల్యేలు రాజీనామకు సిద్దపడుతున్నారనే వార్తలను రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మరింత ముదిరి పాకనా పడ్డాయి. తాజ పరిస్థితులను హ్యాండిల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్దరామయ్యతో పాటు మళ్లి కార్జున కార్గేలు దేవేగౌడలు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇదే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ నేత మంత్రి డీ.కే శివకుమార్ దేవేగౌడతో సమావేశమయ్యారు.

ముంబయిలో క్యాంప్ వేసిన ఎమ్మెల్యేలు
ఇక పార్టీ రాజీనామ చేసిన ఎమ్మెల్యే ముంబాయిలో ఓ ప్రైవేటు హోటళ్లలో బస చేశారు.కాగా వీరితో మంతనాలు జరిపేందుకు మరో కాంగ్రెస్ నేత మహెంద్ర సింగ్ ముంబాయి సోఫియా హోటల్‌లు వెళ్లారు.అయితే తాను ఎమ్మెల్యేలతో చర్చలు జరపలేదని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే సంక్షోభం గురించి మాట్లాడడానికి నిరాకరించారు. ఇక సంక్షోభంపై దేవేగౌడతో మంతనాలు జరుపుతున్నారు. అయితే పరిస్థితిపై వివరించేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు.

సాయంత్రం బెంగుళూరుకు చేరుకోనున్న సీఎం కుమారస్వామి
ఇక అమేరికా వేళ్లిన సీఎం కుమారస్వామి సాయంత్రం బెంగుళూరు చేరుకోనున్నారు. అనంతరం తాజ పరిస్థితులపై ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. మరోవైపు సంక్షోభానికి కీలక సూత్రదారీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు యడ్యురప్ప మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ప్రస్థుత సంక్షోభంపై ఎలాంటీ వ్యాఖ్యలు చేయని యడ్యురప్ప ,ఈ నేపథ్యంలోనే ప్రస్థుత సంక్షోభానికి కారణమని ఆరోపణలు చేసిన మల్లి కార్జున్ ఖార్గే తోపాటు సిద్దరామయ్య వ్యాఖ్యలపై కూడ ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

తనతో 6 గురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు సిద్దరామయ్య
తాజా సంక్షోభంలో కూడ కాంగ్రెస్ పార్టీ మధ్య గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. తనకు రాజీనామ చేసిన వారు తనతో 6గురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ పార్టీ సిద్దరామయ్య ప్రకటించారు. మరోవైపు మళ్లి కార్జున్ ఖార్గేకు సీఎం పదవిని అప్పగిస్తే ప్రభుత్వం నిలబడుతుందనే ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ వ్యాఖ్యలు మళ్లి ఖర్గే స్పందించారు. ఆ విషయాలన్నీ నాకు తెలియదు. నేను సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని ఆశిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు సామరస్యపూర్వకంగా తొలగిపోవాలని కోరకుంటున్నాను. ఇవన్నీ పార్టీలో అంతర్గతంగా విభజన తేవడం కోసం చేసే ప్రయత్నాలు అని అన్నారు.












Click it and Unblock the Notifications