రౌడీషీటర్లతో అసెంబ్లీ స్పీకర్ సీక్రేట్ సమావేశం ?, పక్కలో గ్యాంగ్ లీడర్, ఏం జరుగుతోంది ?
బెంగళూరు/శిరిసి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటుందో ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అయిపోతారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక విధానసభ ( అసెంబ్లీ) స్పీకర్ కొందరు రౌడీషీటర్లతో రహస్య సమావేశం నిర్వహించి వివాదంలో చిక్కుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ (విధాన సభ అధ్యక్షుడు)గా విశ్వేశ్వర హెగ్డే కాగేరి పని చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు అయిన విశ్వేశ్వర హెగ్డే కాగేరి గతంలో మంత్రిగా కూడా పని చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శిరసి నియోజక వర్గం నుంచి విశ్వేశ్వర హెగ్గే కాగేరీ పోటీ చేస్తారని, లేదంటే ఆయన మరో నియోజక వర్గం ఎంచుకునే అవకాశం ఉందని తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్న విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఓ రౌడీషీటర్ తో కలిసి కొంత మందితో సమావేశం అయ్యారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. రౌడీషీటర్ తో కర్ణాటక స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి సమావేశం అయిన ఫోటోలు లీక్ కావడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.
దోపిడీలు, బ్లాక్ మెయిల్, డబ్బులు మోసం చేశారని, కిడ్నాప్ లో చేశాడని తదితర 17కు పైగా క్రిమినల్ కేసులు నమోదు అయిన రౌడీషీటర్ ఫయాజ్ చౌటి అయాస్ చౌటీ బాయ్ తో కర్ణాటక స్పీకర్ విశ్వేశ్వర హెగ్గే కాగేరి సమావేశం అయిన ఫోటోలు వైరల్ అయ్యాయి. స్పీకర్ విశ్వేశ్వేర హెగ్డే పక్కనే రౌడీషీటర్ ఫయాజ్ చౌటి కుర్చుని ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
స్పీకర్ కు ఎదురుగా చాలా మంది వ్యక్తులు కుర్చుని ఉన్న ఫోటోలు ఇప్పుడు బయటకు రావడంతో కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. ఐదు రోజుల క్రితం రౌడిషీటర్ ఫయాజ్ అతని 50 మంది అనుచరులతో కలిసి రహస్యంగా స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరితో భేటీ అయ్యారని వెలుగు చూసింది. అయితే ఈ విషయంలో కర్ణాటక స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి, బీజేపీ నాయకులు ఇంత వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications