మా కులం నాయకుడికి ఎందుకు సీఎం పదవి ఇవ్వకూడదు ?, మా ఓట్లు కావాలి అంతేనా, స్వామీజీ ఫైర్ !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 135 సీట్లు రావడంతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్దరామయ్య ప్రభుత్వం కొలువుతీరి ఆరు నెలలు పూర్తికాకముందే ముఖ్యమంత్రి మార్పుపై సర్వత్రా చర్చ సాగుతోంది, ఈలోగా దళితులను సీఎంచ చెయ్యాలని పలువురు నాయకులు జోరుగా డిమాండ్ చేస్తున్నారు.
కర్ణాటకలోని బాగల్‌కోట్‌లోని వాల్మీకి గురుపీఠ్ మఠానికి చెందిన శ్రీప్రసన్నానంద స్వామీజీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నాయకుడిని సీఎం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి సతీష్ జారకిహోళికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందన, కర్ణాటకకు దళితులు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని స్వామిజీ ప్రశ్నించారు. దళితుల ఓటు బ్యాంకు కావాలని, అయితే దళితులకు మాత్రం ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వరని స్వామిజీ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పదవిని ఎవరైనా లీజు తీసుకున్నారా? లేదా అగ్రిమెంట్ చేసి ఇచ్చారా ? అంటూ శ్రీప్రసన్నానంద స్వామీజీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులను ప్రశ్నించారు. దళితులకు సీఎం అయ్యే అర్హత లేదా ?, లేకపోతే దళితుల ఓట్లు ఎందుకు అడుగుతున్నారు అంటూ స్వామీజీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ఈ విషయమై శ్రీప్రసన్నానంద స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ దళితులకు సీఎం అయ్యే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని విచారం వ్యక్తం చేశారు.
బాగల్‌కోట జిల్లా వాల్మీకి ప్రజా చైతన్య సదస్సు నిర్వహించిన స్వామిజీ తరువాత మాట్లాడారు. ఈ సమయంలో వాల్మీకి గురుపీఠం రాజనహళ్లిలోని ప్రసన్నానంద స్వామీజీ దళితుడిని ఎందుకు సీఎం చేయకూడదని బహిరంగంగా ప్రశ్నించారు. దానికి తోడు దళిత నాయకులు సీఎం అయ్యే సమయం కోసం ఎదురుచూడాల్సి వస్తుందని చెప్పారు.

దళితుల శాసనసభ్యులు చాలా మంది ఉన్నారని, అన్నీ కలిసొచ్చినప్పుడే అవకాశం వస్తుందని, అది మన కోరిక కావచ్చు, కులం సంఘం నాయకుల కోరిక కావచ్చు అని, ఇక్కడ పార్టీ చాలా ముఖ్యం అని, పార్టీ హైకమాండ్ నిర్ణయమే అంతిమమని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు. ముఖ్యమంత్రి మార్పుపై మంత్రి సతీష్ జారకిహోళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీటు విషయంపై ఇప్పటికే సిద్ధరామయ్య మాట్లాడారని అన్నారు. నేను ఐదు సంవత్సరాలు సీఎంగా ఉంటానని సిద్దరామయ్య చెప్పారని, వేచి చూడాల్సిందే అని, సందర్భం వచ్చినప్పుడు చూద్దాం అని మంత్రి సతీష్ జారకిహోళి మాటదాటవేశారు.












Click it and Unblock the Notifications