కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ, ఆసుపత్రిలో ఇలా (ఫోటోలు)

Recommended Video

    కరుణానిధి ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన, 12 ఏళ్ల తర్వాత నెరవేరిన ఆయన కల!

    చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పరామర్శించారు. 94 ఏళ్ల కరుణ చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులతో కలిసి వచ్చిన రాహుల్ ఆయనను పరామర్శించారు.

    Karunanidhi health updates: Rahul Gandhi meets DMK chief in Kauvery hospital

    కరుణానిధిని చూసిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను కరుణానిధిని చూసేందుకు చెన్నై వచ్చానని చెప్పారు. అతనిని తాను చూశానని, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆయన త్వరగా కోలుకోవాలని సందేశం పంపించిందని చెప్పారు. తమకు కరుణ కుటుంబంతో చాలాకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అతను తమిళనాడు ఆత్మ అన్నారు.

    Karunanidhi health updates: Rahul Gandhi meets DMK chief in Kauvery hospital

    కరుణానిధి చికిత్సకు స్పందిస్తున్నారని డీఎంకే నేత ఏ రాజా అంతకుముందు అన్నారు. కరుణానిధి ఆరోగ్యంపై ఎలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+