జీవితంలో ఒక్కసారైనా ఈ రైల్వేస్టేషన్ కు వెళ్లిరండి
ప్రపంచంలోని అన్ని దేశాలు వేరు.. భారతదేశం వేరు. భౌగోళిక స్వరూపంగానే కాకుండా ఎన్నో ప్రకృతి సౌందర్యాలకు నెలవు. ఇటువంటి కర్మభూమిలో జన్మించడం కూడా ఎంతో అదృష్టమని ఆధ్యాత్మికవేత్తలు పదే పదే చెబుతుంటారు. ఇంతటి గొప్పదేశంలో ఎన్నో అందాలు కొలువు తీరాయి. అలాగే భారతీయ రైల్వే కూడా ఒక రైల్వే స్టేషన్ ను అద్భుతమైన ప్రదేశంలో నిర్మించింది. చుట్టూ పచ్చటి కొండలు, పొగమంచుతో కప్పబడి ఉంటుంది. రైలు కూతను బట్టి బండి వస్తుందని అర్థం చేసుకోవాలి. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఆ స్టేషన్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. పేరు కార్వార్ రైల్వేస్టేషన్. ఉత్తర కన్నడ జిల్లాలో ఉంటుంది. కొంకణ్ రైల్వేలో భాగం.
కర్ణాటక కాశ్మీర్ అంటారు
కార్వార్ ను కర్ణాటక కాశ్మీర్ అని పిలుస్తారు. ఇక్కడి రైల్వేస్టేషన్ ను 1994లో నిర్మించారు. ఇక్కడి నుంచి జైపూర్, బెంగళూరు, ఢిల్లీ, ఎర్నాకుళం, ముంబయి, ఇండోర్, కోయంబత్తూరు, అజ్మీర్, తిరువనంతపురం, రత్లాం, మధురై లాంటి ప్రధాన నగరాలను కలుపుతూ కొంకణ్ రైల్వేద్వారా అనుసంధానం చేయబడింది. ఈ స్టేషన్ ను వీక్షించేందుకు, చుట్టుపక్కల అందమైన ప్రదేశాలను తిలకించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. కొంకణ్ రైల్వే మార్గంలో ప్రయాణం చేయాలని ప్రతి భారతీయుడి కల. అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకొని ఈ రైల్వేమార్గాన్ని భారతీయ రైల్వే నిర్మించింది.

అన్నీ అధునాతన సౌకర్యాలే
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని అందుబాటులోకి తెస్తోంది. అందుకు రైళ్లల్లో అధునాతన సౌకర్యాలను కల్పిస్తోంది. త్వరలోనే ప్రవేశపెట్టబోతున్న వందే భారత్ స్లీపర్ రైలులో అన్నీ ఆటోమేటిక్ డోర్లే ఉంటాయి. అలాగే టాయిలెట్లలో కొత్త సౌకర్యాలను ప్రవేశపెట్టారు. సీసీ కెమెరాలతోపాటు రాబోయే స్టేషన్ అనౌన్స్ మెంట్, ఫస్ట్ ఏసీలో వేడినీటి షవర్, మాడ్యులర్ టాయిలెట్, మాడ్యులర్ ప్యాంట్రీ లాంటివి ఉన్నాయి. లోపలికి దుమ్ము రాదు. క్రాష్ బఫర్లు, కప్లర్లు అమర్చారు.












Click it and Unblock the Notifications