• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత రాజకీయాల్లో తల దూర్చాం: ఇజ్రాయెల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గోవాలో ఏర్పాటైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్ఫీ)లో కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై చోటు చేసుకున్న వివాదం.. దుమారం రేపుతోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇఫ్ఫీ ఛైర్మన్, జ్యూరీ చీఫ్ ఇజ్రాయెల్‌కు చెందిన నడవ్ లపిడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్రంగా విమర్శించారు. ఈ సినిమాను ఆయన ఓ ప్రాపగాండ మూవీగా అభివర్ణించారు. వల్గర్‌గా ఉందని పేర్కొన్నారు. ఇఫ్ఫీలో ప్రదర్శించదగ్గ హోదా దీనికి లేదని ఇఫ్పీ వేదిక మీదే తేల్చి చెప్పారు.

వల్గర్, ప్రాపగాండ..

వల్గర్, ప్రాపగాండ..

ఇఫ్ఫి ఛైర్మన్ హోదాలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఓ సినిమాను ఇఫ్ఫీలో ప్రదర్శించడాన్ని జ్యూరీ సభ్యులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని, షాక్‌కు గురయ్యారని నడవ్ లపిడ్ అన్నారు. స్టేజీ మీదే కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై తన అభిప్రాయాలను నిర్ద్వందంగా తెలియజేస్తోన్నానంటూ పేర్కొన్నారు. ప్రాపగాండ, వల్గర్ సినిమాను ఇఫ్ఫీ కోసం ఎంపిక చేయడం సరికాదని అన్నారు.

సిగ్గుచేటు..

నడవ్ లపిడ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అత్యంత సమస్యాత్మక, సున్నిత అంశంగా భావించే కాశ్మీర్ పండిట్ల వలసల మీద చిత్రీకరించిన మూవీ కావడం వల్ల ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతోన్నాయి. ఇందులో కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి- ఘాటుగా స్పందించారు. కాశ్మీర్ ఫైల్స్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటని అనుపమ్ ఖేర్ విమర్శించారు.

ఆయన వ్యక్తిగతం..

ఆయన వ్యక్తిగతం..


నిజం అనేది ఎప్పటికీ అత్యంత ప్రమాదకారి అని, ప్రజలను అబద్ధాలు చెప్పడానికి ప్రోత్సహిస్తుంటుందని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీన్ని పోస్ట్ చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా స్పందించింది. నడవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని పేర్కొంది. దీన్ని తమదేశంతో ముడిపెట్టి చూడకూడదని స్పష్టం చేసింది. లపిడ్ చేసిన వ్యాఖ్యలను తాము ఎంత మాత్రం కూడా సమర్థించట్లేదని వివరణ ఇచ్చింది.

కళ్లల్లో నీళ్లు తిరిగాయి..

కళ్లల్లో నీళ్లు తిరిగాయి..

కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నడవ్ లపిడ్ సిగ్గు పడాలని భారత్‌లోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి షొషాని అన్నారు. ఆ వ్యాఖ్యలను తాను వ్యక్తిగతంగా కూడా సమర్థించట్లేదని స్పష్టం చేశారు. ఆ సినిమా చూడగానే తన కళ్లలో నీళ్లు తిరిగాయని షొషాని అన్నారు. భావోద్వేగాలతో నిండిన ఈ సినిమాను చూడటం అంత తేలిక కాదని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నో బాధలను అనుభవించిన యూదులుగా ఇతరుల బాధలను అర్థం చేసుకోగలమని షొషాని చెప్పారు.

రాజకీయాల్లో తలదూర్చాం..

రాజకీయాల్లో తలదూర్చాం..

ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని తాను ఎవరినీ బలవంతం చేయలేనని, ఈ పని చేస్తే సంతోషిస్తానని షొషాని అన్నారు. నడవ్ లపిడ్- భారత రాజకీయ వివాదాల్లో తల దూర్చాడని, అందువల్ల అతను క్షమాపణ చెప్పాలని వ్యక్తిగతంగా కోరుకుంటోన్నానని వివరించారు. లడవ్ ప్రసంగం తరువాత తాను ఆయనతో మాట్లాడానని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేసినట్లు చెప్పారు.

రెండు దేశాల మధ్య సారూప్యత..

రెండు దేశాల మధ్య సారూప్యత..


అటు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలాన్ కూడా లపిడ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లను పోస్ట్ చేశారు. లపిడ్‌పై ఘాటు విమర్శలు సంధించారు. భారత్-ఇజ్రాయెల్ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. ఈ తేడా, సారూప్యాన్ని కూడా ఆయన గుర్తించ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. సినిమా నేపథ్యం గురించి పూర్తిగా తెలుసుకోకుండా వ్యాఖ్యానించడం సరికాదని, ఇందుకు ఇజ్రాయెల్‌ దేశస్థుడిగా నేను సిగ్గుపడుతున్నానని చెప్పారు.

English summary
Consul General Israel Kobbi Shoshani expressed his contrasting views on the film. He said that he had seen the film and had a different opinion of it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X