కాశ్మీర్ పై ఏం చేద్దాం :గవర్నర్ ను ఆరా తీసిన కేంద్రం
న్యూడిల్లీ : కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై ఏం చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. కాశ్మీర్ గవర్నర్ వోరాతో రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి ఆరా తీశారు. కేంద్ర హోంశఆఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో కాశ్మీర్ గవర్నర్ ఎస్ ఎస్ వోరా సమావేశమయ్యారు. కాశ్మీర్ లో నెలకొన్న తాజా పరిస్థితులను గవర్నర్ మంత్రికి వివరించారు.
కాశ్మీర్ లో 110 రోజులుగా అనిశ్చితి నెలకొంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులను నెలకొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

కాశ్మీర్ లోయలో పాఠశాలలు మూతపడ్డాయి. సాదారణ జనజీవనం స్థంబించింది.దీంతో సాదారణ పరిస్థితులు నెలకొనేలా ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వాలు చర్చిస్తున్నాయి.
కశ్మీర్ లోయలో మూతపడిన 26 స్కూళ్ళను తిరిగి తెరిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్ కేంద్ర హోంశాఖ మంత్రితో చర్చించినట్టు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications