Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కశ్మీర్ కల్లోలంపై కేంద్రం క్లారిటీ.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..!

ఢిల్లీ : ఇంటిలిజెన్స్ బ్యూరో సూచన మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. అమర్‌నాథ యాత్రకు వచ్చే భక్తులకు ముప్పు పొంచి ఉందనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్ అయినట్లు చెప్పారు. జమ్ము కశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు.జమ్ము కశ్మీర్‌లో తెలుగు ప్రజలు సహా మరెవరి భద్రతకు ఢోకా లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. శనివారం రాత్రి 20 మంది తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారని చెప్పుకొచ్చారు.

kashmir issue central government clarity kishan reddy version

ఆదివారం మధ్యాహ్నంకల్లా వారు ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు. మిగిలిన 90 మంది విద్యార్ధులు కూడా త్వరగానే ఢిల్లీకి చేరుకొంటారని చెప్పారు. జమ్ము నుండి విద్యార్దులు, పర్యాటకులు తమ స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కిషన్ రెడ్డి.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తంగా ఉండటంతో పాటు.. ఆ క్రమంలో ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. అదలావుంటే జమ్ములో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా ఆస్ట్రేలియాతో పాటు కొన్ని దేశాల్లో ఉంటున్న వారిని స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. ఈ పరిస్థితుల్లో కశ్మీర్ కు వెళ్లకూడదని పలు సూచనలు చేస్తూ జాగ్రత్తలు చెప్పింది. ఇప్పటికే కశ్మీర్‌లో ఉన్న వారు తమ స్వస్థలాకు రావాలని అత్యవసర సందేశాన్ని కూడా పంపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+