కథూవా కేసు: నార్కో టెస్టుకు సిద్దమన్న నిందితులు, లాయర్‌కు బెదిరింపులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:కథూవాలో ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనపై సోమవారం నాడు జమ్మూ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో ఎనిమిది మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసు విచారణను ఏప్రిల్ 28వ తేదికి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును వాదిస్తానని ముందుకొచ్చిన న్యాయవాది దీపికకు మళ్ళీ బెదిరింపులు వచ్చాయి.ఈ మేరకు ఆమె తనకు బెదిరింపులు వచ్చినట్టు ఆమె మీడియాకు తెలిపింది.

  వెలుగులోకి మరిన్ని సంచలనాలు....!

  కథువాలో ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సోమవారం నాడు జమ్మూలో విచారణ ప్రారంభమైంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నార్కో ఎనాలసిస్ పరీక్షలకు సిద్దమని ప్రకటించారు.దీంతో ఈ కేసును ఏప్రిల్ 28వ తేదికి కోర్టు వాయిదా వేసింది.

   Kathua rape trial: Accused ready for narco test; next hearing on April 28

  మరోవైపు ఈ కేసు విచారణను జమ్మూ కాశ్మీర్ నుండి చంఢీఘడ్ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో మృతురాలి తండ్రి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది.కథూవా రేప్ కేసు ఘటనలో ఎనిమిది మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో ఓ వ్యక్తి మైనర్. దీంతో మైనర్‌ను విడిగా ఈ కేసులో విచారణ చేపట్టనున్నారు.

  అడ్వకేట్‌ దీపికకు బెదిరింపులు

  కథూవా రేప్ కేసులో బాధిత కుటుంబానికి మద్దతుగా వాదిస్తున్న దీపికకు మరోసారి బెదిరింపులు వచ్చాయి ఈ మేరకు తనకు ఆదివారం నాడు కూడ కొందరు వ్యక్తులు ఫోన్లు చేసి ఈ కేసును వాదించకూడదని బెదిరింపులకు పాల్పడ్డారని లాయర్ దీపిక మీడియాకు వివరించారు.ఆదివారం కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్‌ చేశారని, ఈ కేసు వాదిస్తే రేప్‌చేసి చంపేస్తామని బెదిరించారని ఆమె మీడియాతో చెప్పారు. ఈ విచారణ పూర్తయ్యేలోపు నేను ప్రాణాలు కోల్పోవచ్చు లేదా మరొకటి జరగొచ్చు. అయితే బెదిరింపులకు భయపడి విచారణనుంచి మాత్రం తప్పుకోబోనని ఆమె ప్రకటించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Kathua rape and murder case trial, which began in Jammu and Kashmir on Monday, will see its next hearing on April 28.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X