కేదార్‌నాథ్ చెత్త దుస్థితి! పవిత్ర క్షేత్రం డమ్మింగ్ యార్డ్‌గా మారుతోందా?

భారతీయ ఆధ్యాత్మిక క్షేత్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేదార్‌నాథ్ ధామ్‌లో పర్యావరణ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. పవిత్రమైన హిమాలయ ప్రాంతాన్ని భక్తులు ఎంతగా ఆరాధిస్తున్నారో, అదే స్థాయిలో అక్కడ ప్లాస్టిక్, ఇతర చెత్తాచెదారం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కేవలం ఐదు నెలల వ్యవధిలోనే కొండ ప్రాంతం చెత్త కుప్పగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

నోయిడాకు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ గుప్తా అడిగిన దరఖాస్తు ద్వారా కేదార్‌నాథ్ వ్యర్థాలకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఏప్రిల్ నుంచి ఆగస్టు 2026 మధ్య కాలంలోనే ఏకంగా 50.30 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడినట్లు స్థానిక నగర పంచాయతీ స్పష్టం చేసింది. గత ఏడాది మొత్తం యాత్రా సీజన్‌లో వెలువడిన చెత్తతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

Kedarnath Generates Over 50 Metric Tonnes Of Waste In Five Months Sparking Environmental Concerns

గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన చెత్త..

గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ పెరుగుదల ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది. కేదార్‌నాథ్‌లో 2023లో 32.58 మెట్రిక్ టన్నులు, 2024లో 26.10 మెట్రిక్ టన్నులు, అలాగే 2025లో 21.40 మెట్రిక్ టన్నుల చెత్త మాత్రమే ఉత్పత్తి అయింది. కానీ 2026లో మాత్రం కేవలం ఐదు నెలల్లోనే రికార్డు స్థాయిలో 50.30 టన్నుల చెత్త బయటకు రావడంతో అధికారులు అవాక్కయ్యారు.

Warning: చెత్త వేస్తున్నారా? కరెంట్, నీళ్లు కట్.. సుప్రీం సీరియస్ వార్నింగ్!
Warning: చెత్త వేస్తున్నారా? కరెంట్, నీళ్లు కట్.. సుప్రీం సీరియస్ వార్నింగ్!

ప్లాస్టిక్ వ్యర్థాలపై అధికారుల స్పందన..

ఈ ఐదు నెలల్లో వెలువడిన మొత్తం చెత్తలో దాదాపు 20 మెట్రిక్ టన్నుల వరకు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉండటం గమనార్హం. అయితే ఇందులో 18.5 మెట్రిక్ టన్నుల (92.5 శాతం) ప్లాస్టిక్‌ను ప్రాసెస్ చేశామని, మిగిలిన 1.5 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఇంకా ప్రాసెసింగ్ చేయాల్సి ఉందని నగర పంచాయతీ వెల్లడించింది. అలాగే గత ఐదు సంవత్సరాలలో మొత్తం నాలుగు ల్యాండ్‌ఫిల్స్‌ను నిర్మించామని, ప్రస్తుతం 30 వేల చదరపు అడుగుల సామర్థ్యం ఉన్న ల్యాండ్‌ఫిల్‌లో ఇంకా 28 వేల చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉందని తెలిపింది.

Video: అందాల ఎవరెస్ట్ అసహ్యకర రూపం.. అంతా విష వ్యర్థాలే!
Video: అందాల ఎవరెస్ట్ అసహ్యకర రూపం.. అంతా విష వ్యర్థాలే!

పర్యావరణానికి ముప్పుగా మారుతున్న భక్తుల రద్దీ..

ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 15 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. రికార్డు స్థాయిలో వస్తున్న భక్తుల తాకిడే ఈ వ్యర్థాల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. హిమాలయాల వంటి సున్నితమైన పర్యావరణ వ్యవస్థలో ఇలాగే చెత్త పేరుకుపోతే భవిష్యత్తులో పెను ముప్పు తప్పదని, పవిత్ర క్షేత్రాన్ని మనమే స్వయంగా డమ్మింగ్ యార్డ్‌గా మారుస్తున్నామని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+