వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిపా వైరస్ బాధితులకు సేవకు కఫీల్‌ఖాన్ రెడీ, గ్రీన్ సిగ్నలిచ్చిన విజయన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపనంతపురం:నిపా వైరస్ కారణంగా ఇబ్బందిపడుతున్న రోగులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ కఫీల్‌ఖాన్‌ను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ ఆహ్వనించారు. ప్రమాదకర నిపా వైరస్ కారణంగా ఇప్పటికే కేరళలో సుమారు 10 మందికిపైగా మృత్యువాతపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్న అరుదైన వైరస్‌ నిపాను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం తగిన నివారణ చర్యలను ముమ్మరం చేసింది. వైరస్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించేందుకు దేశ వ్యాప్తంగా స్పెషలిస్ట్‌ వైద్యులను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆహ్వానించారు.

Kerala CM Welcomes Kafeel Khan’s Offer to Serve in Nipah-Hit Areas

వైరస్‌ గోవా, ముంబై రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతుందన్న వార్తల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వేగంగా స్పందించింది. అమాయకులైన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నాకు అవకాశం ఇవ్వండంటూ కఫీల్‌ ఖాన్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీనికి స్పందించిన విజయన్‌ నిపా బాధితులకు ఉచితంగా వైద్యం చేసేందుకు కేరళ వస్తున్న డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌కు ధన్యవాదాలు అంటూ పోస్టు చేశారు.

కాగా గత ఏడాది ఆగస్ట్‌లో గోరఖ్‌పూర్‌ని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలో ఆక్సిజన్‌ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలో కఫీల్‌ఖాన్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసింది. కఫీల్‌ఖాన్‌ ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.

English summary
Dr Kafeel Khan, a pediatrician from Uttar Pradesh, who was infamously embroiled in a clash with the Yogi government over the infant deaths in Gorakhpur Hospital, has volunteered his services in the regions affected by the Nipah virus in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X